విడదల రజినికి వరసగా చిక్కులు.. సవాళ్లు విసురుతున్న పరిస్థితులు ఇవే..

వరుస ఇష్యూస్‌ నేపథ్యంలో రజినిని చిలకలూరిపేట నుంచి..రేపల్లెకు మారుస్తారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

విడదల రజినికి వరసగా చిక్కులు.. సవాళ్లు విసురుతున్న పరిస్థితులు ఇవే..

Vidadala Rajini

Updated On : November 12, 2025 / 5:20 PM IST

Vidadala Rajini: విడదల రజిని.. వైసీపీ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఆమె. అప్పట్లో ఓ రేంజ్‌లో హవా నడిపించారు. చిలకలూరిపేటలో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత సీనియర్లను కాదని మంత్రి అయిన ఈ మహిళా నేత..2024లో మరొక నియోజకవర్గం పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు.

ఆ తర్వాత తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు వచ్చారు. అప్పటి నుంచి ఆమెకు అన్నీ సవాళ్లే ఎదురవుతున్నాయి. ఓవైపు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులను ఫేస్ చేస్తున్న ఆమె.. మరోవైపు కేసులు, అవినీతి ఆరోపణలు..ఒకదాని తర్వాత మరోక ఇష్యూతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు‌. సేమ్‌టైమ్‌ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆమె ఫ్యామిలీ మెంబర్స్, తన పీఏలపై కూడా అలిగేషన్స్ ఎక్కువయ్యాయి. (Vidadala Rajini)

Jubilee Hills Bypoll 2025: ఒకే ఒక్క ఉప ఎన్నిక పొలిటికల్ గేమ్‌ఛేంజర్ కాబోతోందా? ఉత్కంఠ కంటిన్యూ..

విడదల రజిని గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిన తర్వాత సొంత ఇంటిలో కుంపట్లు మొదలయ్యాయి. రజని మరిది గోపి, పీఏ రామకృష్ణ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటను గోపి చూసుకుంటాడు అనే ప్రచారం జరిగింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు నేపథ్యంలో కుంటుబం రెండుగా విడిపోయందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి‌.

ఇక ఫ్యామిలీలో విభేదాలు, అవినీతి ఆరోపణలు, కేసుల సంగతి అలా ఉంటే..రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు విడదల రజిని. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిపోయారు. అటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గం..ఇటు మర్రి వర్గం..మరోవైపు పుల్లారావు ఇలా మూడు దిక్కుల నుంచి విడదలను పొలిటికల్‌గా కార్నర్ చేస్తున్నారట. అయితే చిలకలూరిపేట నుంచి పోటీ చేయాలంటే ఆ ముగ్గుర్ని తట్టుకొని నిలబడే నేతేవరు లేరట. అందుకే విడదల రజినినే కంటిన్యూ అవుతున్నారని అంటున్నారు.

కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండే సెగ్మెంట్ ఇది

చిలకలూరిపేట అంటేనే కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండే సెగ్మెంట్. అలాంటి నియోజకవర్గంలో బీసీ మహిళా పోటీ చేసి గెలిచింది. కానీ సామాజిక వర్గాల పరంగా అక్కడా ఇప్పటికే చుక్కెదురే అవుతుంది. 2019 ఎన్నికల్లో తనని ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయని, మర్రి రాజశేఖర్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఓడించేందుకు ప్రయత్నం చేశారని గతంలోనే జగన్‌కు చెప్పుకున్నారు విడదల. ఇప్పుడా ఇద్దరు నేతలు టీడీపీలో ఉన్నారు.

అయితే చిలకలూరిపేట ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి విడదల రజినిని రేపల్లెకు మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. పేటలో రజినిపై క్యాడర్‌లో అసంతృప్తి ఎక్కువగా ఉందని అంటున్నారు. వరుస ఇష్యూస్‌ నేపథ్యంలో రజినిని చిలకలూరిపేట నుంచి..రేపల్లెకు మారుస్తారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రేపల్లె ఇంచార్జ్‌గా ఈవూరి గణేష్ ఉన్నారు. సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను కాదని గణేష్‌కు టికెట్ ఇస్తే, ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదట.

దీంతో రజినిని రేపల్లెకు మార్చి చిలకలూరిపేటకు కొత్తవారిని తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. పొన్నూరులో కూడా ప్రస్తుతం సరైన ఇంచార్జ్‌ లేరన్న వాదన వినిపిస్తోంది. దీంతో రజినిని అక్కడికి మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంచార్జ్‌ను మార్చాలని కొంతమంది వైసీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీంతో రజనిని మార్చి మరొక నియోజకవర్గంకు పంపుతారా లేక చిలకలూరిపేటకే పరిమితం చేస్తారా అనేది వేచి చూడాలి.