Jubilee Hills Bypoll 2025: ఒకే ఒక్క ఉప ఎన్నిక పొలిటికల్ గేమ్‌ఛేంజర్ కాబోతోందా? ఉత్కంఠ కంటిన్యూ..

ఏ ఫలితం వచ్చినా, ఇది తెలంగాణ పొలిటికల్ సినారియోలో మార్పులు రావడం అయితే పక్కా.

Jubilee Hills Bypoll 2025: ఒకే ఒక్క ఉప ఎన్నిక పొలిటికల్ గేమ్‌ఛేంజర్ కాబోతోందా? ఉత్కంఠ కంటిన్యూ..

Jubilee Hills Bypoll 2025

Updated On : November 12, 2025 / 5:09 PM IST

Jubilee Hills Bypoll 2025: సర్వశక్తులు..సవాళ్లు, ప్రతి సవాళ్లు. గెలుపు నీదా నాదా.? అన్నట్లుగా నెక్స్ట్ లెవల్ ఫైట్ నడిచింది. లాస్ట్ మినిట్ వరకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఎక్కడా తగ్గకుండా నెగ్గేందుకు..చివరి నిమిషం వరకు శ్రమించాయి. నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు..నాలుగు కోట్ల మంది ప్రజల తలరాతలు మార్చబోతున్నారంటూ బీఆర్ఎస్..పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని కాంగ్రెస్..జూబ్లీహిల్స్ ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేశాయి. అయితే ఎలక్షన్ ముగిసింది.

రిజల్ట్ బాకీ ఉంది. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే గెలుపు మీద బీఆర్ఎస్ ధీమాగా ఉంది. సైలెంట్ వేవ్..ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో..తామే గెలిస్తామని అంటోంది. ముందు నుంచి రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేకత ఉందని చెబుతూ వస్తోన్న బీఆర్ఎస్..ఈ ఎన్నికల ఫలితంతో దాన్ని ప్రూవ్ చేయాలని భావిస్తోంది. ఒకవేళ ఈ బైపోల్లో బీఆర్ఎస్ భావిస్తున్న ఫలితం రాకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్ బైపోల్ ఇలా అన్నింట్లో ఓడుతూ వచ్చింది కారు పార్టీ. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా బీఆర్ఎస్ ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోతే మాత్రం కారు క్యాడర్ మరింత డీలా పడే ప్రమాద ఉందన్న చర్చ జరుగుతోంది. రాబోయే GHMC ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు..ఒకవేళ జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే..జూబ్లీహిల్స్ ఫలితం అక్కడ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బైఎలక్షన్లో గెలిచి తీరాలని భావించింది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్కు కాంగ్రెస్కు అనుకూలంగా అంచనాలు ఇవ్వడంతో కారు పార్టీలో కలవరం రేగుతోంది.

Also Read: వాతావరణ పరిస్థితులలో మార్పులు.. ఆసుపత్రుల్లో బెడ్లు రెడీ.. వైద్యారోగ్య శాఖ హెచ్చరిక.. ప్రజలు ఇవి పాటించాలి..

ఇటు అధికార కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంది. ఈ బైఎలక్షన్ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కు చాలా కీలకమని భావిస్తున్నారు. అందుకే అన్నీ తానై..ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ఫోకస్ పెట్టారు. ఒకవేళ జూబ్లీహిల్స్ రిజల్ట్ తేడా కొడితే మాత్రం కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత ఉందని ప్రూవ్ అవడమే కాదు..మరిన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి రావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలు..రేవంత్ రెడ్డికి అధిష్టానం బ్రేకులు..కొంతమంది మంత్రుల రచ్చ..ఈ పరిణామాల నేపథ్యంలో..జూబ్లీహిల్స్ లో గెలవాల్సిందేనని భావిస్తోంది హస్తం పార్టీ.

ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్టీపై రేవంత్ మరింత పట్టు సాధించే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వంలోనూ, మంత్రులపై ఆజమాయిషీ చేయడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఇలా అన్ని అంశాల్లో రేవంత్ అప్పర్ హ్యాండ్ సాధించాలంటే..ఈ బైపోల్లో కాంగ్రెస్ గెలవాల్సిందేనన్న చర్చ జరుగుతోంది. సేమ్టైమ్ ఇక్కడ ఓడితే పార్టీ సీనియర్ నేతలు రేవంత్ సీఎం సీటుకు ఎసరు పెట్టొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలు మళ్లీ తలెత్తే ప్రమాదం లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది.

పైగా రాబోయే గ్రేటర్ ఎన్నికలు, స్థానిక సంస్థల పోల్స్పై కచ్చితంగా ఎఫెక్ట్ చూపించనుంది. ఈ బైపోల్లో గెలిస్తే..ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు కోసం బీఆర్ఎస్ మరింత గట్టిగా ఫైట్ చేయనుంది. సేమ్టైమ్ ఆరు గ్యారెంటీల అమలు కోసం కూడా కాంగ్రెస్ సర్కార్పై ప్రెజర్ పెరగనుంది. ఇలా జూబ్లీహిల్స్ రిజల్ట్..కాంగ్రెస్కు ఎన్నో సవాళ్లు విసరనుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అనుకూలంగా అంచనా వేస్తున్నా..సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్ను టెన్షన్ పెడుతోందట.

ఈ ఎన్నికను బీజేపీ అంత సీరియస్గా తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రత్యేకంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి నాయతక్వానికి సవాల్గా చెబుతున్నారు. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీజేపీకి దాదాపు 70 వేల ఓట్లు వచ్చాయని..గట్టి ఫైట్ ఇస్తామని చెబుతున్నారు కమలనాథులు.

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ థర్డ్ ప్లేస్ తోనే సరిపెట్టుకుంటుందని..డిపాజిట్ కూడా ఆనుమానమేననే అంచనా వేశాయి. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ గెలిస్తే తమకు తిరుగులేదని, దూకుడుగా ప్రజల్లోకి వెళ్లనుంది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ స్థానం మరింత బలపడుతుంది. ఏ ఫలితం వచ్చినా, ఇది తెలంగాణ పొలిటికల్ సినారియోలో మార్పులు రావడం అయితే పక్కా. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో చూడాలి మరి.