వాతావరణ పరిస్థితులలో మార్పులు.. ఆసుపత్రుల్లో బెడ్లు రెడీ.. వైద్యారోగ్య శాఖ హెచ్చరిక.. ప్రజలు ఇవి పాటించాలి..
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు అవసరమైన మందులు సిద్ధం చేశారు.
Seasonal Flu
Weather Updates: వాతావరణ పరిస్థితులలో మార్పుల రీత్యా తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెచ్చరిక చేసింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే 7 రోజులు పొడి వాతావరణం, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-3°C తక్కువగా ఉండే అవకాశం ఉంది.
దీనితో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (సీజనల్ ఫ్లూ) వ్యాప్తి ప్రమాదం ఉంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు సిద్ధం చేశారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.బి.రవీందర్ నాయక్ ఈ కింది సూచనలు చేశారు.
సీజనల్ ఫ్లూ లక్షణాలు
- జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, అలసట
- దగ్గు/తుమ్ము ద్వారా సులభంగా వ్యాపిస్తుంది
చికిత్స
- ఇంట్లో విశ్రాంతి, ద్రవ పదార్థాలు సేవించాలి. వారంలో కోలుకుంటారు
- గర్భిణులు, 5 ఏళ్ల లోపు పిల్లలు, 65+ వయస్సు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి
- అధిక జ్వరం, శ్వాస తీవ్రత, పెదవులు, చర్మం నీలం రంగు, రక్తం కక్కడం వంటి వాటితో బాధపడితే 108 అంబులెన్స్‌కు కాల్ చేయాలి
ఈ సీజన్‌లో చేయాల్సినవి
- దగ్గు, తుమ్ము సమయంలో రుమాలు, టిష్యూ ఉపయోగించండి
- సబ్బుతో తరచూ చేతులు కడగండి
- కళ్లు, ముక్కు, నోరు తాకకుండా ఉండండి
- రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండండి
- జ్వరం, దగ్గు ఉంటే ఇంట్లోనే ఉండండి
- గదుల్లో తాజా గాలి వచ్చేలా చూడండి
- తగినంత నీరు, పౌష్టిక ఆహారం, నిద్ర
చేయకూడనివి
- చేతులు కలపడం
- టిష్యూ, రుమాలు మళ్లీ ఉపయోగించడం
- జబ్బు ఉన్నవారితో సన్నిహితంతా ఉండడం
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం
- డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం
