WhatsApp Scam Calls : మీ వాట్సాప్‌కు ఈ ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? ఫోన్ ఎత్తారంటే ఖతమే.. అదో పెద్ద స్కామ్..!

WhatsApp Scam Calls : వాట్సాప్‌ మళ్లీ మోసగాళ్లకు టార్గెట్‌గా మారింది. స్కామర్లు +84, +62, +60 వంటి అంతర్జాతీయ నంబర్ల నుంచి ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో సురక్షితంగా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

WhatsApp Scam Calls : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. వాట్సాప్ ప్లాట్‌ఫారంపై మరో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. వాట్సాప్‌లో చాలా మంది స్కామర్‌లు యూజర్లను మోసగించి డబ్బులు కాజేసేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే.. ఈ యాప్‌లో యూజర్లను చేరుకోవడం చాలా సులభం. దాదాపు రెండు బిలియన్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగిన వాట్సాప్ మళ్లీ స్కామర్లకు అడ్డగా మారింది. చాలా మంది స్కామర్లు +84, +62, +60 వంటి అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి వాట్సాప్ కాల్ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించరాదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా వంటి దేశాల నుంచి వాట్సాప్ యూజర్లు యాదృచ్ఛికంగా ఇలా వాట్సాప్ కాల్‌లను స్వీకరిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇలాంటి ISD కోడ్‌లను సూచిస్తుంది. ఈ కాల్స్ ఎందుకు వస్తున్నాయనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాల్‌ ఫ్రీక్వెన్సీ మీడియం నుంచి ఎక్కువగా ఉంటుంది. చాలామంది వాట్సాప్ యూజర్లకు 2 నుంచి 4 కాల్స్ వచ్చాయి. ముఖ్యంగా కొత్త సిమ్ కొనుగోలు చేస్తున్న కొంతమందికి అంతర్జాతీయ నంబర్ల నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి.

వాట్సాప్ లేటెస్ట్ కాల్ స్కామ్.. ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇలాంటి ఫోన్ కాల్ వస్తే.. ఆ కాలర్‌ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలి. తెలియని కాలర్ మీ డేటా లేదా డబ్బును దొంగిలించడానికి ఏదైనా మాల్వేర్‌ని ఇంజెక్ట్ చేయవచ్చు. అందుకే ఇలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్ లు వచ్చినప్పుడు వాటికి ఆన్సర్ చేయొద్దు. ఆయా లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదు. స్కామర్లు మీ అకౌంట్లో డబ్బులను దొంగిలించేందుకు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులు గుర్తు తెలియని కాలర్‌తో మాట్లాడరాదు. ఇలా ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే.. వెంటనే బ్లాక్ చేయాలి.

Read Also : Poco F5 5G Launch : రూ. 30వేల లోపు ధరకే పోకో F5 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

Note : వాట్సాప్‌లో జాబ్ ఆఫర్ స్కామ్ (Job Offer Scam) కూడా జరుగుతోంది. వినియోగదారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తిని నమ్మరాదు. వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లో మీకు ఉద్యోగం ఆఫర్ చేస్తున్న వ్యక్తి ఐడెంటిటీని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.

లేటెస్ట్ స్కామ్‌పై వాట్సాప్ స్పందన :
వాట్సాప్‌లో గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే.. అలాంటి వాట్సాప్ కాల్‌లను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయమని మెటా యాజమాన్యంలోని సంస్థ వాట్సాప్ సూచిస్తోంది. అనుమానాస్పద మెసేజ్/కాల్‌లను నిరోధించడంతో పాటు నివేదించాలి. గుర్తు తెలియని అంతర్జాతీయ లేదా దేశీయ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్‌లకు ఆన్సర్ చేయరాదని వాట్సాప్ హెచ్చరిస్తోంది. వాట్సాప్ యూజర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీపై స్థిరమైన పెట్టుబడి పెట్టామని పేర్కొంది.

WhatsApp Scam Calls : Getting WhatsApp calls from phone numbers starting

IT నియమాలు 2021 ప్రకారం.. నెలవారీ వినియోగదారు భద్రతా నివేదిక, వినియోగదారు ఫిర్యాదుల వివరాలను కలిగి ఉంటుంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సాప్ ద్వారా స్వీకరించిన రిపోర్టులపై వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. మార్చి నెలలోనే 4.7 మిలియన్లకు పైగా అకౌంట్లను వాట్సాప్ నిషేధించింది.

వాట్సాప్‌లో ఒకరిని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం ఎలా :
* మీరు ముందుగా WhatsAppని ఓపెన్ చేయాలి. More Options >Settings ఆప్షన్ Tap చేయండి.
* ఇప్పుడు, Privacy>Blocked Contacts ఆప్షన్ మళ్లీ నొక్కండి.
* కేవలం ‘Add’ బటన్‌పై నొక్కండి.
* ఇప్పుడు, మీరు బ్లాక్ చేసే కాంటాక్ట్ కోసం సెర్చ్ చేయండి
* కాంటాక్టు చాట్ బాక్సులో టాప్ రైట్ కార్నర్‌లో త్రి డాట్స్ నొక్కండి.
* మీకు Block అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

Read Also : SUV Cars Sale : ఏప్రిల్‌లోనూ ఆగని కార్ల జోరు.. అత్యధికంగా అమ్ముడైన SUV కార్లు ఇవే..

ట్రెండింగ్ వార్తలు