Gmail user ALERT : మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ నుంచి Secret email ఇలా పంపుకోవచ్చు!

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవసరం ఉంటుంది. ఇతర వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్‌ల కోసం Gmail అకౌంట్ చాలా అవసరం.

Gmail user ALERT : ప్రస్తుత ఆధునియుగంలో దాదాపు ప్రతి ఒక్కరికీ Gmail అకౌంట్ కామన్.. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవసరం ఉంటుంది. ఇతర వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్‌ల కోసం Gmail అకౌంట్ చాలా అవసరం.. అయితే ఇప్పటివరకూ జీమెయిల్ అకౌంట్ ద్వారా మెయిల్ ఎలా పంపుకోవాలో తెలిసి ఉండొచ్చు. కానీ, Gmail కాన్ఫిడెన్షియల్ మోడ్ ఫీచర్ ద్వారా కూడా మెసేజ్ లు పంపవచ్చని మీకు తెలుసా? అవును.. మీరు చదివింది నిజమే.. అనధికారిక యాక్సెస్ నుంచి సున్నితమైన డేటాను రక్షించడంలో ఈ సీక్రెట్ మోడ్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ-మెయిల్ పంపడానికి Gmail Secret Mode ఉపయోగించవచ్చు. మీరు ఈమెయిల్ పంపేందుకు గడువు తేదీని సెట్ చేసుకోవచ్చు. అందుకు మీరు కాన్ఫిడెన్షియల్ మోడ్‌ని ఉపయోగించవచ్చు. లేదంటే ఎప్పుడైనా యాక్సెస్‌ చేసుకోవడాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. కాన్ఫిడెన్షియల్ ఈ-మెయిల్ అందుకున్న వారు ఆ మెసేజ్‌ను ఫార్వార్డ్, కాపీ, ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేయకుండా డిజేబుల్ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంది.

మీ ఈ-మెయిల్ అందుకున్న మరో యూజర్ షేర్ చేయకుండా కాన్ఫిడెన్షియల్ మోడ్ కంట్రోల్ చేస్తుంది. మీరు పంపిన మెసేజ్ లేదా అటాచ్‌మెంట్‌ల స్క్రీన్‌షాట్‌లు లేదా ఫొటోలు తీయకుండా అడ్డుకోలేదనే విషయాన్ని గుర్తించుకోవాలి. మీ కంప్యూటర్‌లో హానికరమైన ప్రోగ్రామ్‌లు ఉన్న మెయిల్ రీసివర్లు.. ఇప్పటికీ మీ మెసేజ్‌లు లేదా అటాచ్ మెంట్స్ కాపీ చేసుకోవచ్చు.. అలాగే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్, ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్ ద్వారా కూడా సీక్రెట్ మెసేజ్ అటాచ్ మెంట్స్ పంపవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

కంప్యూటర్ ద్వారా సీక్రెట్ ఈమెయిల్ ఇలా పంపుకోవచ్చు..
ఆఫీసుల్లో లేదా స్కూల్ అకౌంట్లలో Gmail వాడుతున్నారా? మీరు కాన్ఫిడెన్షియల్ మోడ్‌ ద్వారా సీక్రెట్ ఈమెయిల్ పంపుకోవచ్చు.

1. మీ కంప్యూటర్‌లో Gmail ఓపెన్ చేయండి.. కంపోజ్‌పై క్లిక్ చేయండి.
2. విండో కిందిభాగంలో కుడివైపున, కాన్ఫిడెన్షియల్ మోడ్‌ ఆన్ (Mode On) క్లిక్ చేయండి.
3. గడువు తేదీ, పాస్‌కోడ్‌ను సెట్ చేసుకోండి.. ఈ సెట్టింగ్‌ ఏదైనా అటాచ్ మెంట్స్‌కు వర్తిస్తాయి. No SMS పాస్‌కోడ్ ఎంచుకుంటే.. Gmail యాప్‌ ద్వారా మెయిల్ అందుకునే యూజర్లు నేరుగా ఓపెన్ చేయగలరు. Gmail యాప్ లేనివారికి మాత్రం ఈ-మెయిల్ పాస్‌కోడ్ వస్తుంది. మీరు SMS Passcode ఎంచుకుంటే.. టెక్స్ట్ ద్వారా పాస్‌కోడ్‌ను పొందవచ్చు. అప్పుడు ఫోన్ నంబర్‌ కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవ్ చేసుకోవాలి.
4. సేవ్ (Save) క్లిక్ చేయండి.

iPhone, Android ఫోన్, టాబ్లెట్, iPadలో సీక్రెట్ ఈమెయిల్‌ను ఎలా పంపాలంటే :
1. Gmail యాప్‌ ఓపెన్ చేయండి.
2. కంపోజ్‌పై Tap చేయండి.
3. టాప్ రైట్ కార్నర్‌లో More పై ట్యాప్ చేయండి. కాన్ఫిడెన్షియల్ మోడ్ కనిపిస్తుంది.
4. కాన్ఫిడెన్షియల్ మోడ్‌ని ఆన్ చేయండి.
5. గడువు తేదీ, పాస్‌కోడ్ ఇతర కంట్రోల్స్ సెట్ చేయండి. ఈ సెట్టింగ్‌ ఏదైనా అటాచ్ మెంట్స్‌కు వర్తిస్తాయి. No SMS పాస్‌కోడ్ ఎంచుకుంటే.. Gmail యాప్‌ ద్వారా మెయిల్ అందుకునే యూజర్లు నేరుగా ఓపెన్ చేయగలరు. Gmail యాప్ లేనివారికి మాత్రం ఈ-మెయిల్ పాస్‌కోడ్ వస్తుంది. మీరు SMS Passcode ఎంచుకుంటే.. టెక్స్ట్ ద్వారా పాస్‌కోడ్‌ను పొందవచ్చు. అప్పుడు ఫోన్ నంబర్‌ కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవ్ చేసుకోవాలి.
6. సేవ్ (Save) క్లిక్ చేయండి.
7. Done బటన్‌పై (Tap) నొక్కండి.

యాక్సెస్‌ ముందుగానే రిమూవ్ చేయండిలా :
సెట్ చేసిన గడువు తేదీకి ముందుగానే మీరు పంపిన ఈమెయిల్‌ను చూడకుండా ఆపొచ్చు.. అది ఎలాగో తెలుసుకోండిలా..
1. కంప్యూటర్, Android ఫోన్, టాబ్లెట్, iPhone లేదా iPad, Gmail ఓపెన్ చేసుకోవాలి.
2. టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కంప్యూటర్‌లో Sent on computer బటన్ పై క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్, టాబ్లెట్, ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో మెనూపై Tap చేసి పంపాలి.
3. సీక్రెట్ ఈమెయిల్‌ను ఓపెన్ చేయండి.
4. Remove access బటన్‌పై క్లిక్ చేయండి.

కాన్ఫిడెన్షియల్ మోడ్‌ ఈ-మెయిల్‌ను ఓపెన్ చేయాలంటే..
మీ జీమెయిల్‌లో అటాచ్ మెంట్స్ పంపిన తర్వాత గడువు తేదీ వరకు ఓపెన్ చేయొచ్చు.. అలాగే పంపినవారు యాక్సెస్‌ని రిమూవ్ చేసే వరకు చూడొచ్చు. ఈమెయిల్‌ను ఓపెన్ చేయడానికి మీరు పాస్‌కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు