గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ లాగ్ అవుతోందా? రోజంతా బ్యాటరీ రావడం లేదా? అయితే మీలాంటి పర్ఫార్మెన్స్ లవర్స్ కోసమే Realme Narzo 80 Pro 5G మార్కెట్‌లోకి వచ్చింది. అసలు ధర రూ.26,000 ఉన్న ఈ ఫోన్.. ఇప్పుడు భారీ డిస్కౌంట్లు, కూపన్లతో కలిపి కేవలం రూ.19,500 లోపే లభిస్తోంది.
కానీ, ఈ ఆఫర్లను చూసి వెంటనే కొనేయాలా? లేక ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా? ప్రతి ఫీచర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుందాం.
పర్ఫార్మన్స్
ఫోన్ వేగానికి గుండె లాంటిది ప్రాసెసర్. ఈ విషయంలో Realme ఎలాంటి రాజీ పడలేదు.
శక్తిమంతమైన ప్రాసెసర్, భారీ ర్యామ్‌తో రోజువారీ పనుల నుంచి హై-ఎండ్ మల్టీటాస్కింగ్ వరకు ఎక్కడా లాగ్ అనే మాటే వినిపించదు.
డిస్‌ప్లే, బ్యాటరీ
Realme ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా గేమర్ల కోసం డిజైన్ చేసిందని చెప్పడానికి ఈ ఫీచర్లే సాక్ష్యం..
ఫీచర్ | Realme Narzo 80 Pro 5G |
---|---|
డిస్‌ప్లే | 6.72″ OLED (HyperGlow Esports Display) |
రిఫ్రెష్ రేట్ | 120Hz (అల్ట్రా స్మూత్) |
పీక్ బ్రైట్‌నెస్ | 4500 నిట్స్ (ఎండలో కూడా అద్భుతంగా కనిపిస్తుంది) |
ప్రత్యేకత | వెట్ హ్యాండ్ టచ్ (తడి చేతులతోనూ పనిచేస్తుంది) |
కంటి రక్షణ | 3840Hz PWM డిమ్మింగ్ (కళ్లకు హాయిగా ఉంటుంది) |
బ్యాటరీ | 6000mAh (ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా మర్చిపోవచ్చు) |
ఛార్జింగ్ | 80W SuperVOOC (నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది) |
అదనపు ఫీచర్ | రివర్స్ ఛార్జింగ్ (ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేయొచ్చు) |
విపరీతమైన బ్రైట్‌నెస్, స్మూత్ రిఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీ, మెరుపు వేగంతో ఛార్జింగ్… ఈ విభాగంలో Narzo 80 Proకి పోటీనే లేదు.
కెమెరా
ఈ ఫోన్ ప్రధాన బలం గేమింగ్ అయినప్పటికీ, కెమెరా విషయంలో కూడా వెనకబడలేదు.
ఫొటోలు, వీడియోలు చాలా నాణ్యంగా వస్తాయి. Sony సెన్సార్ ఉండటం వల్ల రంగులు సహజంగా ఉంటాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కాకపోయినా, సోషల్ మీడియా, రోజువారీ వాడకానికి కెమెరా పనితీరు సంతృప్తికరంగా ఉంటుంది.
ధర, ఆఫర్లు
ఇతర ఆఫర్లు
ఈ ఫోన్ వీరికి పర్ఫెక్ట్