అసలే కరోనా కాలం.. ఏది తాకాలన్నా భయమే. ఏదైనా వస్తువు తాకాలంటే వణికిపోతున్నారు. కరోనా భయం ప్రతిఒక్కరిని వెంటాడుతోంది. ప్రతిఒక్కరి ఇంట్లో టాయిలెట్ వాడకం కామన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో టాయిలెట్ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి టాయిలెట్ క్లీన్ చేసేందుకు వాడే బ్రెష్ ల విషయంలోనూ జాగ్రత వహించాలంటోంది ఓ బ్రెష్ ల కంపెనీ. చాలావరకు టాయిలెట్స్ శుభ్రం చేసేందుకు బ్లీచ్ వాడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటోంది Goodpapa అనే కంపెనీ. ప్రపంచంలోనే తొలిసారిగా టాయిలెట్‌ను ఆటోమాటిక్ గా శానిటైజ్ చేసే బ్రష్‌ను అందించనుంది.
టాయిలెట్ ను శుభ్రం చేసిన తరువాత గుడ్ పాపా బ్రష్ తిరిగి మళ్లీ కంటైనర్ లోకి వెళ్తుంది. ఈ బ్రష్‌ను యువీ కిరణాలతో తయారు చేశారు. టాయిలెట్ ను శుభ్రం చేసిన తర్వాత బ్రష్ లో ఉన్న బాక్టీరియాను చంపుతుంది. Goodpapa ప్రకారం.. UV-C కిరణాలు 120 సెకన్లలో 99.9శాతం బాక్టీరియాను చంపుతాయని కంపెనీ తెలిపింది. ఏమైనా నీటి బిందువులు ఉంటే వెంటిలేషన్ , గాలి ద్వారా వెంటనే ఆరిపోయేలా చేస్తుంది. అంతేకాదు.. బాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. బ్రష్ ను మృదువుగా ఉండేలా తయారు చేసింది.
బ్రష్ ను ఉపయోగించి ఈజీగా టాయిలెట్ ను శుభ్రం చేయవచ్చు. బ్రష్ ను 300 RPM స్పీడ్ తో టాయిలెట్ ని స్పిన్నింగ్ చేస్తుంది. మెుండి మరకలు ఉన్న ప్రదేశంలో బ్రష్‌ను నొక్కి ఉంచాలి. బ్రష్ కి ఉన్న హ్యాండిల్ ద్వారా బ్రష్ ను ప్లగ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 2000 mAhతో ఒక్క సారి ఛార్జీ చేస్తే 3 నెలల పాటు వస్తుంది.
బ్రష్ IPX7 రేటింగ్ ప్రకారం.. బ్రష్ లోపలికి నీరు ప్రవేశించినా మోటారు చెడిపోకుండా ఉండేలా దీన్ని కంపెనీ తయారు చేసింది. ప్రస్తుతం గుడ్ పాపా టాయిలెట్ బ్రష్ Kickstarter లో అందుబాటులో ఉంది. గుడ్ పాపా టాయిలెట్ బ్రష్ ఒక వినూత్నమైన ఆవిష్కరణగా కంపెనీ చెబుతోంది. టాయిలెట్ క్లీనింగ్ కి తయారు చేసిన డివైజ్‌ల్లో షైన్ బాత్రూమ్ అసిస్టెంట్(కెమికల్ ఫ్రీ టాయిలెట్ బౌల్ క్లీనర్) ఒకటి. మీరు మీ టాయిలెట్ ను ఎలాంటి చికాకు లేకుండా శుభ్రం చేసుకోవాలనుకుంటే ఒకసారి Goodpapa టాయిలెట్ బ్రష్‌ను ప్రయత్నించి చూడండి.