Google Pixel 9 : పిక్సెల్ ఫ్యాన్స్ కొనాల్సిన ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ లో ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు.. డోంట్ మిస్

Google Pixel 9 Price : గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ లో ఏకంగా రూ. 20,500 ధర తగ్గింపు పొందింది.

Google Pixel 9 : పిక్సెల్ ఫ్యాన్స్ కొనాల్సిన ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ లో ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు.. డోంట్ మిస్

Google Pixel 9

Updated On : September 5, 2025 / 3:20 PM IST

Google Pixel 9 Price : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 9పై భారీ డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. రూ. 20,500 కన్నా ఎక్కువ (Google Pixel 9 Price) తగ్గింపును అందిస్తోంది.

మీ ప్రస్తుత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటే పిక్సెల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఇంతకీ ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Google Pixel 9 Price : ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 9 డీల్ :

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.13,700 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ధర రూ.66,299కి తగ్గింది. అలాగే, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.7వేలు తగ్గింపును కూడా పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కూడా ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Motorola Edge 50 Pro : భారీగా తగ్గిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే, 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌తో కలిగి ఉంది. అలాగే, డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. టెన్సర్ G4 ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఇంకా, పిక్సెల్ 9 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ పిక్సెల్ ఫోన్ ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా కలిగి ఉంది.