Free Google AI Plus : విద్యార్థులకు పండగే.. గూగుల్ AI Plus ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌.. ఏడాదంతా ఎంజాయ్.. ఈ ఆఫర్‌ ఇలా పొందండి!

Free Google AI Plus : గూగుల్ ఏఐ ప్లస్‌కు ఫ్రీ యాక్సెస్ ఏడాది వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఆ తర్వాత కూడా కావాలంటే నెలకు రూ. 399 రుసుము చెల్లించాలి.

Free Google AI Plus

  • కాలేజీకి వెళ్లే విద్యార్థులకు స్టూడెంట్ స్పెషల్ ఏఐ ఆఫర్
  • ఆఫర్‌ పొందాలంటే మీరు స్టూడెంట్ అని వెరిఫై చేయించుకోవాలి
  • గూగుల్ ఏఐ ప్లస్ కు ఫ్రీ యాక్సెస్ ఒక ఏడాది పాటు వ్యాలిడిటీ

Free Google AI Plus : విద్యార్థులకు పండగే.. గూగుల్ ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ కావాలా? భారతీయ విద్యార్థుల కోసం పూర్తిగా ఫ్రీగా గూగుల్ ఏఐ ప్లస్ అందిస్తోంది. ఈ సంస్థ విద్యార్థులకు ఏడాది పాటు ప్రత్యేక బెనిఫిట్స్ అందిస్తుంది. స్టడీ కోసం ఏఐ టూల్స్ వాడేవారికి అద్భుతంగా ఉంటుంది.

విద్యార్థులకు రీసెర్చ్, ఎగ్జామ్ ప్రిపరేషన్, రైటింగ్ అసిస్టెంట్, కెరీర్ సపోర్టు కంటెంట్ క్రియేషన్ వంటివి చేసుకోవచ్చు. గూగుల్ కంపెనీ 400GB స్టోరేజ్‌ను కూడా పూర్తిగా ఫ్రీగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవాలంటే విద్యార్థులు ఈ రూల్స్ పాటించాలి.. ఇంతకీ అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

Read Also : Poco M8x 5G Launch : భలే ఉంది భయ్యా ఫోన్.. కొత్త పోకో M8x 5G కేక పుట్టిస్తోందిగా.. ఛార్జింగ్ టెన్షన్ లేదు..!

గూగుల్ ఏఐ ప్లస్ స్టూడెంట్ ఆఫర్‌ ఎలా? :
కంపెనీ ఫ్రీ గూగుల్ ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం స్పెషల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్ ఏఐ ప్లస్ స్టూడెంట్ ఆఫర్ ప్రత్యేకంగా కాలేజీ విద్యార్థుల కోసం రూపొందించారు. విద్యార్థులు గూగుల్ వన్ ప్లాన్స్ పేజీని విజిట్ చేసి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందుకోసం మీ గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ చేయాలి.

  • ముందుగా గూగుల్ అకౌంటుతో సైన్ ఇన్ చేయండి.
  • (Google AI Plus) సెక్షన్‌లో Get Student Offer ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆపై Continue బటన్ పై క్లిక్ చేయండి.
  • మీరు Student అని వెరిఫై చేయించుకోవాలి.
  • అడిగిన అన్ని వివరాలను నింపి స్టూడెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి.
  • ఒకసారి వెరిఫై అయ్యాక మీకు ఒక ఏడాది పాటు ఫ్రీ ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది

గూగుల్ ఏఐ ప్లస్‌కు ఫ్రీ యాక్సెస్ ఒక ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఆ తర్వాత కూడా కావాలంటే రూ. 399 ప్లాన్ తీసుకోవాలి. లేదంటే ఆటో-పేమెంట్‌ను ఆపేసుకోవాలి.

గూగుల్ ఏఐ ప్రో స్టూడెంట్ ఆఫర్ :
విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా అందుబాటులో ఉంది. విద్యార్థులు 4 ఏళ్ల పాటు 74శాతం తగ్గింపుతో పొందవచ్చు. అంటే.. మీరు నెలకు రూ. 489 ఖర్చుతో 4 ఏళ్ల పాటు గూగుల్ ఏఐని తక్కువ ధరకే యాక్సెస్ చేయవచ్చు. కంపెనీ 5TB స్టోరేజ్ అందిస్తోంది యూట్యూబ్ ప్రీమియం లైట్‌కు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.