Google Policy Update : ఇలాంటి జీమెయిల్ అకౌంట్లను గూగుల్ డిలీట్ చేస్తుంది జాగ్రత్త.. మీ అకౌంట్ కాపాడుకోండిలా..!

Gmail Accounts Delete : గూగుల్ తమ పాలసీని అప్‌డేట్ చేసింది. కొత్తగా అప్‌డేట్ చేసిన పాలసీ ప్రకారం.. భారీగా జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Google announces mass removal of inactive Gmail accounts

Google removal of inactive Gmail accounts : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? గూగుల్ పాలసీ ప్రకారం.. భారీగా జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేయనుంది. ఏళ్ల తరబడి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న జీమెయిల్ అకౌంట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాలని గూగుల్ యోచిస్తోంది. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇమెయిల్ సర్వీసుల్లో జీమెయిల్ ఒకటి.

గూగుల్ జీమెయిల్ ఏఐ రూపొందించిన రెస్పాన్స్, టూ-ఫ్యాక్టర్డ్ వెరిఫికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. టెక్ దిగ్గజం, గత మేలో, జీమెయిల్ అకౌంట్లలో కంటెంట్‌ను పూర్తిగా డిలీట్ చేయడం నుంచి ఇప్పుడు అకౌంట్ల తొలగింపుతో సహా పాలసీ మార్పును వెల్లడించింది. ఈ మార్పుతో మిలియన్ల కొద్దీ ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను ప్రమాదంలో పడేస్తుంది. మీ జీమెయిల్ కూడా ఇలానే ఇన్‌యాక్టివ్‌గా ఉందా? అయితే, మీ అకౌంట్ ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

Read Also : Gmail Bulk Messages : మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయిందా? సింగిల్ క్లిక్‌తో బల్క్ మెసేజ్‌లన్నీ డిలీట్ చేసుకోవచ్చు..!

గూగుల్ అప్‌డేట్ చేసిన ఇన్‌యాక్టివ్ పాలసీ ప్రకారం.. జీమెయిల్ అకౌంట్ రెండు సంవత్సరాలకు పైగా ఉపయోగించబడకుండా ఉంటే.. గూగుల్ వర్క్‌స్పేస్‌లో అకౌంట్, అనుబంధిత కంటెంట్‌ను తొలగించే హక్కు సెర్చ్ దిగ్గజానికి ఉంది. గూగుల్ డ్రైవ్, గూగుల్ మీట్, గూగుల్ డాక్స్, అలాగే యూట్యూబ్ ఫొటోలను కలిగి ఉంటుంది.

Google inactive Gmail accounts

ఆ జీమెయిల్ అకౌంట్లకు మాత్రం వర్తించదు :

ఈ పాలసీలో మార్పు పర్సనల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, సంస్థలతో లింక్ అయిన అకౌంట్లకు వర్తించదని గమనించడం ముఖ్యం. ఈ అప్‌డేట్‌తో గూగుల్ ఇంటర్నల్ విశ్లేషణలో ఇన్‌యాక్టివ్ అకౌంట్లు 2ఎఫ్ఏ కాన్ఫిగర్ చేయడానికి 10 రెట్లు తక్కువ అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

అలాంటి అకౌంట్లతో భద్రతా ఉల్లంఘనలు, లీక్‌లకు మరింత అవకాశం ఉంటుంది. లేదంటే.. సైబర్ మోసగాళ్లు ఇన్‌యాక్టివ్ లేదా ఉపయోగించని జీమెయిల్ అకౌంట్లను లక్ష్యంగా చేసుకోవచ్చు. మీకు తెలియకుండానే అనధికారిక యాక్సెస్, హానికరమైన కార్యకలాపాలకు దారితీస్తుందని నివేదిక హెచ్చరిస్తుంది.

గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ వీపీ రూత్ క్రిచెలీ మాట్లాడుతూ.. ‘మర్చిపోయిన లేదా పట్టించుకోని జీమెయిల్ అకౌంట్లు తరచుగా పాత లేదా మళ్లీ ఉపయోగించిన పాస్‌వర్డ్‌లతోనే ఎక్కువగా ఉంటాయి. అలాంటి జీమెయిల్ అకౌంట్లలో టూ-స్టెప్ అథెంటికేషన్ సెటప్ చేయకపోతే భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.

Google mass removal inactive Gmail accounts

ప్రతి రెండు ఏళ్లకు ఒకసారైనా లాగిన్ తప్పనిసరి : 

మీ జీమెయిల్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ కాకుండా నిరోధించడానికి గూగుల్ కనీసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లాగిన్ అవ్వమని సూచిస్తుంది. జీమెయిల్ ప్రత్యేకంగా సైన్ ఇన్ చేయవలసిన అవసరం లేదు. మీ అకౌంట్ స్టేటస్ యాక్టివ్‌గా ఉంచడానికి గూగుల్ సంబంధిత సర్వీసులో ఏదైనా యాక్టివిటీ ఉన్నా సరిపోతుంది.

మరోవైపు.. గూగుల్ సొంత పిక్సెల్ ఫోన్‌లలో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇందులో ఇప్పుడు భారత్ కూడా ఉంది. గూగుల్ ఈ ఫీచర్ కోసం సపోర్టు ఉన్న ప్రాంతాల జాబితాలో భారత్, నాలుగు ఇతర దేశాలను చేర్చింది. కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ మొదట 2019లో అమెరికాలో పిక్సెల్ ఫోన్‌లలో ప్రవేశపెట్టింది.

Read Also : Google Mak.ing Domain : గూగుల్ కొత్త డొమైన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా? .ing డొమైన్ ఎలా పొందాలంటే?