Google Chrome Warning As Millions Of Users Told To Change Their Passwords
Google Chrome Warn : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు వెంటనే తమ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచిస్తోంది. గూగుల్ క్రోమ్ యూజర్లకు హ్యకింగ్ ముప్పు ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రోమ్ బ్రౌజర్ అకౌంట్లను తరచుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. క్రోమ్ బ్రౌజర్‌లోని హిడెన్ ఫీచర్లను యూజర్లు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. గూగుల్ రిమెంబర్ దిస్ పాస్‌వర్డ్ ఫీచర్ (Google Remember This Password) ఫీచర్ ద్వారా హ్యాకర్ల నుంచి యూజర్లకు సెక్యూరిటీ కల్పిస్తుంది.
అయితే క్రోమ్ పాస్‌వర్డ్ టైప్ చేసిన తర్వాత సేవ్ చేస్తున్నట్టుయితే.. ఎవరైనా హ్యాక్ చేస్తే గూగుల్ యూజర్‌కు వెంటనే తెలిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 4 బిలియన్ల (400 కోట్లకు)పైగా యూజర్ నేమ్ (Username), పాస్వర్డ్ హ్యాకింగ్ (Password Hacking) గురయినట్టు వెల్లడించింది. హ్యాకింగ్ ముప్పు నుంచి బయటపడేందుకు 2019లో గూగుల్ ఫస్ట్ టెస్టింగ్ జరిపింది.
అందులో 6,50వేల మంది పాల్గొన్నట్లు గూగుల్ ప్రతినిధి జెన్నీఫర్ వెల్లడించారు. సుమారు 3 లక్షల యూజర్ నేమ్, పాస్‌వర్డు సురక్షితమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. థర్డ్ పార్టీ టూల్స్ కారణంగా హ్యాకర్లు అందిన సమాచారంతో తరచుగా యూజర్ అకౌంట్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని తెలిపింది.
యూజర్ నేమ్, పాస్‌వర్డ్ పటిష్ఠంగా ఉంటే హ్యాక్ చేయలేరన్నారు. గూగుల్ క్రోమ్ లేదా రిమెంబర్ దిస్ పాస్‌వర్డ్ ఫీచర్ ద్వారా యూజర్ పాస్‌వర్డ్ సురక్షితం కాదని భావిస్తే.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోవాల్సిందిగా గూగుల్ యూజర్లకు సూచిస్తోంది. మీ యూజర్ అకౌంట్ సంబంధించి ఏదైనా అనుమానాస్పద లాగిన్ అయినట్టు గుర్తిస్తే.. వెంటనే మీ మొబైల్ లేదా మెయిల్ ఐడీకి అలర్ట్ మెసేజ్ వస్తుంది. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ కూడా తరచుగా మార్చుకోవాలని గూగుల్ సూచిస్తోంది.
Read Also : Covid 19: నిత్యావసరాలు స్టాక్ పెట్టుకోండి.. దేశ ప్రజలను అలర్ట్ చేసిన చైనా ప్రభుత్వం