Google Discover Tab : గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో కొత్త AQI ఫీచర్.. మీ సిటీలో ఎయిర్ క్వాలిటీ చెక్ చేయొచ్చు..!

Google Discover Tab : గూగుల్ డిస్కవరీ ఫీడ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్ Google iOS, Android డివైజ్‌లలో డిస్కవర్ ట్యాబ్‌కు ఎయిర్ క్వాలిటీ (AQI) కార్డ్‌ని యాడ్ చేస్తోంది. కార్డ్ AQI స్థాయిని, గాలి నాణ్యత స్థితిని సూచించే కలర్-కోడెడ్ డాట్‌ను చూపిస్తుంది.

Google Discover Tab will soon start showing the air quality index in your city in telugu

Google Discover Tab : ప్రస్తుత రోజుల్లో వాతావరణ కాలుష్యం భారీగా పెరిగిపోయింది. ప్రధానంగా వాయు కాలుష్యం (Air Polution) కారణంగా అనేక మంది ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మీ ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టడం వల్ల ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టతరంగా మారింది. ఢిల్లీ NCR వంటి ప్రాంతంలో వాయు కాలుష్యం ఇప్పటికే విపరీతంగా పెరిగింది. వాహనదారులు శ్వాస తీసుకోవడమే కష్టంగా ఉంది.

బయటకు వెళ్లే ముందు గాలి నాణ్యతను చెక్ చేయడం చాలా ముఖ్యం. మీ బహిరంగ కార్యకలాపాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. గూగుల్ యూజర్లకు ఎయిర్ క్వాలిటీని ట్రాక్ చేయడంలో సాయపడాలని యోచిస్తున్నట్లు నివేదించింది. కలుషిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు విలువైన టూల్‌గా పనిచేస్తుంది.

అతి త్వరలో డిస్కవరీ ఫీడ్‌లో AQI ట్యాబ్ :
9to5Google నివేదిక ప్రకారం.. ఈ ప్లాట్‌ఫారమ్ iOS, Android ఆపరేటింగ్ సిస్టమ్‌లలో డిస్కవర్ ట్యాబ్‌లో AQI కార్డ్‌ను రిలీజ్ చేస్తోంది. హోమ్ స్క్రీన్‌కు ఎడమ వైపున ఉన్న గూగుల్ యాప్‌ (Google App)లో వినియోగదారులు ఈ కొత్త ట్యాబ్‌ని త్వరలో చూస్తారు. అయితే, ఈ ఫీచర్ టాబ్లెట్‌లు లేదా పిక్సెల్ ఫోల్డ్‌లో ఇంకా అందుబాటులో లేదు. అయినప్పటికీ, మొబైల్ డివైజ్‌లలో గూగుల్ డిస్కవర్ ఫీడ్‌ (Google Discover Feed)లో మినీ కార్డ్‌ని అందిస్తుంది. లోకల్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ అప్‌డేట్‌లను చూపిస్తుంది. మెటీరియల్ యు స్విచ్‌లను చెక్‌బాక్స్‌లతో భర్తీ చేస్తూ కంపెనీ కస్టమైజ్ మెనుని కూడా రీస్టోర్ చేస్తోంది.

Read Also : Google Pixel Buds Pro Discount : గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రోపై భారీ డిస్కౌంట్.. రూ.10వేల లోపు ధర మాత్రమే.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

డిస్కవరీ ట్యాబ్‌లో మూడు మినీ కార్డులివే :
ప్రస్తుతం గూగుల్ డిస్కవర్ ట్యాబ్‌లో మూడు మినీ-కార్డులను కలిగి ఉంది. అందులో క్రీడలు (Sports), వాతావరణం (Weather), ఆర్థికం (Finance), స్పోర్ట్స్ కార్డ్ మీరు ఫాలో అయ్యే జట్లకు సంబంధించిన లైవ్ అప్‌డేట్‌లను చూపుతుంది. వెదర్ కార్డ్ మిమ్మల్ని ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో అప్‌డేట్ చేస్తుంది. ఫైనాన్స్ కార్డ్ స్టాక్ ధరలు, మీరు ఫాలో అయ్యే పరిశ్రమల మార్కెట్ ట్రెండ్‌లను ట్రాక్ చేస్తుంది. గూగుల్ డిస్కవర్ ట్యాబ్‌కు నాల్గవ మినీ-కార్డ్‌ను యాడ్ చేస్తోంది. ఎయిర్ క్వాలిటీ (AQI)తో మినీ ట్యాబ్ వినియోగదారులు తమ ప్రాంతంలో గాలి నాణ్యతను త్వరగా, సులభంగా చెక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, వినియోగదారులు కేవలం AQI మినీ కార్డ్‌పై Tap చేస్తే సరిపోతుంది. డిస్కవర్ ట్యాబ్‌లో కనిపించే గాలి నాణ్యత డేటా కోసం సెర్చ్ చేయొచ్చు.

Google Discover Tab start showing air quality index

ఎయిర్ క్వాలిటీని చెక్ చేయొచ్చు :
ఎంతో ఉపయోగకరమైన ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలోని గాలి నాణ్యత గురించి తెలుసుకోవచ్చు. బయటికి వెళ్లే ముందు గాలి నాణ్యతను చెక్ చేయడానికి ఇది అనుకూలమైన మార్గం. ముఖ్యంగా వాయు కాలుష్యం ప్రభావంతో శ్వాస సమస్యలతో ఇబ్బంది పడే వారికి చాలా అవసరం. మరోవైపు, ఆండ్రాయిడ్ వెర్షన్ కన్నా AQI మినీ కార్డ్ iOS వెర్షన్ మరింత అడ్వాన్స్ ఉంటుందని నివేదిక పేర్కొంది. AQI మినీ కార్డ్ ప్యూచర్ వెర్షన్ చూపే AQI లెవల్స్, దూరం, గాలి నాణ్యత స్థితి వంటి మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. గాలి నాణ్యత స్థితికి సూచికను కూడా కలిగి ఉంటుంది. గాలి నాణ్యత స్థితిని ప్రతిబింబించేలా రంగు మారుతుంటుంది.

బీటా యూజర్లకు మాత్రమే :
అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ (వెర్షన్ 14.32), iOSలోని గూగుల్ యాప్ బీటాలో ఖాళీ కార్డ్ ఉందని, అది Tap చేయగానే ‘Air Quality’ సెర్చ్ నిర్వహిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ, యాప్ స్టోర్ లిస్టులో ఈ ఫీచర్ ఎలా ఉంటుందో ఇప్పటికే కనిపిస్తుంది. ‘మీరు గాలి నాణ్యత స్థితికి అనుగుణంగా కలర్-కోడెడ్ డాట్‌తో పాటు సంఖ్యా AQIని అందుకుంటారు. అలాగే లొకేషన్, రీడింగ్ టైమ్ గురించి సమాచారాన్ని అందుకుంటారని నివేదికలో పేర్కొన్నారు.

Read Also : Google Discover Feed : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఫీచర్.. భారతీయ యూజర్ల కోసం డెస్క్‌టాప్‌లో డిస్కవర్ ఫీడ్..!