Google AI Chatbot : AI చాట్‌బాట్‌‌ లెమోనీపై గూగుల్ ఉద్యోగి కామెంట్స్.. అంతే ఉద్యోగం ఊడింది!

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ AI చాట్‌బాట్‌పై సీనియర్ టెకీ త‌ప్పుదారి ప‌ట్టించే వ్యాఖ్య‌లు చేశాడు. దాంతో గూగుల్ అతడిపై వేటు వేసింది.

Google AI Chatbot :  సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ AI చాట్‌బాట్‌పై సీనియర్ టెకీ త‌ప్పుదారి ప‌ట్టించే వ్యాఖ్య‌లు చేశాడు. దాంతో గూగుల్ అతడిపై వేటు వేసింది. ప్రోడ‌క్ట్ డేటాను కాపాడ‌టం స‌హా డేటా సెక్యూరిటీ పాల‌సీల‌ను అతడు ఉల్లంఘించాడ‌ని గూగుల్ ప్ర‌తినిధి ఒకరు వెల్లడించారు. లెమోనీపై అతడు చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పుదారి ప‌ట్టించేలా ఉన్నాయ‌ని గూగుల్ సహా పలువురు సైంటిస్టులు పేర్కొన్నారు. హ్యుమన్ లాంగ్వేజ్ రూపొందించేందుకు డిజైన్ చేసిన LaMDA కేవలం ఒక సంక్లిష్టమైన అల్గారిథ‌మ‌ని గూగుల్ స్ప‌ష్టం చేసింది. ల్యాంగ్వేజ్ మోడ‌ల్స్‌పై చేపట్టిన‌ ప‌రిశోధ‌న‌లపై డైలాగ్ అప్లికేష‌న్స్ కోసం LaMDA డిజైన్ చేశామ‌ని కంపెనీ పేర్కొంది.

గూగుల్ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బ్లేక్.. కంపెనీకి చెందిన డేటా సెక్యూరిటీ విధానాలను ఉల్లంఘించడాని గూగుల్ ప్రతినిధి తెలిపారు. ఈ అంశంపై సుదీర్ఘంగా గూగుల్ విచారిస్తోంది. లామ్‌డా.. AI Chatbot లాంగ్వేజ్ మోడల్.. ఫర్ డైలాగ్ అప్లికేషన్స్, ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత లాంగ్వేజ్ మోడల్‌లు ఇలా ఏమైనా సరే తప్పనిసరిగా వాటి గురించి మాట్లాడటం నేర్చుకోవవచ్చునని పరిశోధనలో తేలింది. గూగుల్ ప్రముఖ సైంటిస్టులు సైతం లెమోయిన్ అభిప్రాయాలను తోసిపుచ్చారు. LaMDA అనేది కేవలం ఒక సంక్లిష్టమైన అల్గోరిథమన్నారు. మానవులను నమ్మదగిన భాషను రూపొందించడానికి మాత్రమే డిజైన్ చేయడం జరిగిందని అభిప్రాయపడ్డారు.

Read Also : Google Play Store : గూగుల్ ప్లే స్టోర్ నుంచి 50 యాప్స్ తొలగింపు.. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే తీసేయండి!

ట్రెండింగ్ వార్తలు