Google Samsung Apps : గూగుల్ హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 శాంసంగ్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

Google Samsung Apps : మొబైల్ యూజర్లను గూగుల్ హెచ్చరిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ రెండు శాంసంగ్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తోంది. అవేంటో తెలుసా?

Google flags these two Samsung apps as harmful, uninstall immediately from your phone

Google Samsung Apps : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను గూగుల్ హెచ్చరిస్తోంది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ (Google Play Protect), ఆండ్రాయిడ్‌లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఫీచర్, ఇటీవలే రెండు Samsung యాప్‌లు, Messages, (Wallet)ను హానికరమని తప్పుగా ఫ్లాగ్ చేసింది. కొంతమంది శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తెలియజేసింది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది కాల్ లాగ్‌లు, మెసేజ్‌లు లేదా ఫొటోల వంటి పర్సనల్ డేటాను స్నూప్ చేసే హానికరమైన యాప్‌లు, గేమ్‌ల గురించి సెక్యూరిటీ సిస్టమ్ హెచ్చరిస్తుంది. అయితే, ఇటీవలి ప్లే ప్రొటెక్ట్ రెండూ లీగల్ యాప్‌లు అయినప్పటికీ, Messages, Wallet డేంజరస్ యాప్ అంటూ తప్పుగా గుర్తించింది.

9to5Google నివేదిక ప్రకారం.. కొన్ని రోజుల క్రితమే (Samsung Galaxy) స్మార్ట్‌ఫోన్‌ల కొంతమంది యూజర్లు (Samsung Messages, Wallet) యాప్‌లు హానికరమని గూగుల్ సెక్యూరిటీ సర్వీసు అయిన గూగుల్ ప్లే ప్రొటెక్ట్ నుంచి హెచ్చరికలను అందుకుంటారు. యాప్‌లు, SMS మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లు లేదా కాల్ హిస్టరీ వంటి పర్సనల్ డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని హెచ్చరికలు పేర్కొన్నాయి.

Read Also : Google Discover Tab : గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో కొత్త AQI ఫీచర్.. మీ సిటీలో ఎయిర్ క్వాలిటీ చెక్ చేయొచ్చు..!

గూగుల్ హెచ్చరిక తర్వాత శాంసంగ్ మెసేజ్‌లు, వ్యాలెట్ యాప్‌లతో సమస్యలు తాత్కాలిక సర్వర్ వైఫల్యానికి కారణమయ్యాయి. అయితే, గూగుల్ ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించింది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనలు లేకుండా యాప్‌లను సాధారణంగా ఉపయోగించవచ్చని శాంసంగ్ కూడా ధృవీకరించింది.

శాంసంగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లోని మెసేజ్ ధృవీకరించింది. గూగుల్ సర్వర్ ఇప్పుడు రీస్టోర్ చేయడంతో యూజర్లు సాధారణంగా ఉపయోగించవచ్చునని పేర్కొంది. ఇంతలో, శాంసంగ్ మెసేజ్‌లు, వ్యాలెట్ యూజర్లు Google Play ప్రొటెక్షన్ హెచ్చరికను డిలీట్ చేయడం ద్వారా సురక్షితంగా ఈ యాప్‌లను వాడవచ్చు. ఇదే సమస్య కొనసాగితే వినియోగదారులు హెచ్చరికను విస్మరించవచ్చు. వారి ఫోన్‌ను రీసెట్ చేయొచ్చు. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ యాప్ కోసం Cache డేటాను క్లియర్ చేయడం, యాప్‌ని Stop చేయడం, అన్‌ఇన్‌స్టాల్ చేయడం, మళ్లీ ఇన్‌స్టాల్ చేయొచ్చు.

యూజర్లు మొబైల్ యాప్‌లను ఇలా రీసెట్ చేయొచ్చు :

* Settings నావిగేట్ చేయండి.
* Apps యాప్‌లను ఎంచుకోండి.
* More Options ఐకాన్ క్లిక్ చేయండి.
* యాప్ సెట్టింగ్‌లను Reset ఎంచుకోండి.
* Resest నిర్ధారించి, ఆపై డివైజ్ రీసార్ట్ చేయండి.

Google two Samsung apps

యాప్ ప్రాధాన్యతలను రీసెట్ చేయడం వల్ల డిజేబుల్ చేసిన యాప్‌లు, నోటిఫికేషన్‌లు, బ్యాక్‌గ్రౌండ్ డేటా వినియోగం, అనుమతులతో సహా అన్ని యాప్‌లలో డిఫాల్ట్ సెట్టింగ్స్ రీసెట్ చేసుకోవచ్చు. అయితే, యూజర్లు ఇప్పటికే ఉన్న ఏ యాప్ డేటాను కోల్పోరు. యాప్‌ని రీసెట్ చేయడం ద్వారా వినియోగదారులు మళ్లీ మెసేజెస్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చని శాంసంగ్ హామీ ఇచ్చింది.

అదే సమయంలో, యూజర్లు గూగుల్ ప్లే ప్రొటెక్షన్ నిలిపివేయకూడదు. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ డేంజరస్ యాప్‌లు, డివైజ్‌లను స్కాన్ చేస్తుంది. మొబైల్ యూజర్లు వాటిని డౌన్‌లోడ్ చేసే ముందు సెక్యూరిటీ పరంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లను చెక్ చేస్తుంది. మాల్వేర్ వంటి ఇతర సోర్స్ నుంచి కనిపించే హానికరమైన యాప్‌లను స్కాన్ చేస్తుంది. ఏవైనా హానికరమైన యాప్‌లను గుర్తిస్తే వెంటనే యూజర్లను హెచ్చరిస్తుంది.

Google Play ప్రొటెక్షన్ ఆన్ చేయాలంటే? :
* గూగుల్ ప్లే స్టోర యాప్‌ను ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ ఐకాన్ Tap చేయండి.
* Play Protect సెట్టింగ్‌లను Tap చేయండి.
* Play Protectని On లేదా Off చేసి యాప్‌లను Scan చేయండి.

Read Also : Tech Tips in Telugu : మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రాక్ చేస్తున్నాయా? వెంటనే ఇలా ఆపేయండి!