Google Pay ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై Voiceతో డబ్బులు పంపుకోవచ్చు!

ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. పే వాయిస్ (Pay-via-Voice) ఫీచర్.. ఇకపై Voice Command ద్వారా యూజర్లు తమ మనీ బ్యాంకు అకౌంట్లోకి పంపుకోవచ్చు.

Google Pay-via-Voice feature : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. పే వాయిస్ (Pay-via-Voice) ఫీచర్.. గూగుల్ పే తమ యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఈ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. గూగుల్ ఫర్ ఇండియా 2021 విజన్ (Google For India 2021 Vision)లో భాగంగా ఈ కొత్త ఫీచర్ ఆవిష్కరించింది. ఇప్పటివరకూ UPI నెంబర్ ఎంటర్ చేసి Send చేస్తే ఇతరుల బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. ఇకపై ఈ కొత్త Voice Command ద్వారా యూజర్లు తమ మనీ మరొకరికి బ్యాంకు అకౌంట్లోకి పంపుకోవచ్చు. వాయిస్ ఇన్‌పుట్‌ ద్వారా డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేసేందుకు (Speech to Text) అనే ఫీచర్​ను గూగుల్ యాడ్ చేయనుంది.

వాయిస్ ఆధారంగా డబ్బులను పంపే Money Transer Option తీసుకొచ్చేందుకు గూగుల్ వర్క్ చేస్తోంది. మీ వాయిస్ కమాండ్ ద్వారా క్షణాల్లో మీరు పంపాలనుకున్న వ్యక్తి అకౌంట్లోకి డబ్బు వెంటనే ట్రాన్సఫర్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఈ వాయిస్​ కమాండ్ ఇంగ్లీష్ (English)​, హిందీ (Hindi) రెండు భాషల్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అందుకే దీనికి హింగ్లీష్ (Hinglish) అని పేరు పెట్టారు. Pay-via-Voice ఫీచర్ వచ్చే ఏడాది 2022 నుంచి అందుబాటులోకి రానుంది. రాబోయే ఏళ్లల్లో ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు ఇతర భారతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, వంటి భాషల్లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.

అతి త్వరలోనే ఈ Speech to Text ఫీచర్ గూగుల్​ పే యూజర్లు అందరికి అందుబాటులోకి తీసుకురానుంది. మీ వాయిస్​ ఇన్​పుట్ ద్వారా మీరు ఏయే బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు పంపాలనుకుంటున్నారో వారికి ఈజీగా మనీ ట్రాన్స్​ చేసుకోవచ్చు అనమాట.. మీ బ్యాంకు అకౌంట్​ నెంబర్‌ను హిందీ లేదా ఇంగ్లీష్​లో వాయిస్ కమాండ్ ద్వారా పలకాల్సి ఉంటుంది. మీకు అక్కడ సెండర్​ కన్ఫర్మేషన్​ (Sender Confirmation) అడుగుతుంది. ఆ వెంటనే పేమెంట్​ అయిపోతుంది.. అంతే.. మీ బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి..

Read Also : WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!

ట్రెండింగ్ వార్తలు