Google Launching New Rules : గూగుల్ ప్లే స్టోర్ కొత్త గైడ్ లైన్స్

నిజమైన యాప్స్ ఏంటో..నకిలీ యాప్స్ తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గూగుల్ ప్లే స్టోర్ గుర్తించి...కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Google : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకొ కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి తెస్తున్నాయి పలు సంస్థలు. ఇందులో యాప్స్ ఒకటి. అయితే..నకిలీ యాప్స్ కూడా కలకలం రేపుతున్నాయి. దీనికారణంగా..చాలా మంది మోసపోతున్నారు. లక్షల రూపాయలు కోల్పోతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటాయి. అసలు నిజమైన యాప్స్ ఏంటో..నకిలీ యాప్స్ తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గూగుల్ ప్లే స్టోర్ గుర్తించి…కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ గైడ్ లైన్స్ 2021 చివరి నాటికి అమలు చేసేందుకు సిద్ధమౌతున్నట్లు గూగుల్ వెల్లడించింది. యాప్‌ టైటిల్‌ను 30 క్యారెక్టర్లకు తగ్గించనుంది. ఐకాన్‌లో డెవలపర్‌ ప్రమోషన్‌ పేరును తొలగించనుంది. ఒకవేళ…తప్పుదారి పట్టించేలా ఉన్న యాప్ ఐకాన్ పై ఇచ్చే గ్రాఫిక్స్ కూడా నిషేధం విధిస్తున్నట్లు సమాచారం. క్యాపిటల్‌ ఫాంట్స్‌ వాడకాన్ని, యాప్‌ పేరులో ఎమోజీలను వాడకూడదని వెల్లడించింది.

ఈ మార్గదర్శకాలు పాటించకపోతే..యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. యాప్ ను యూజర్లు ఇన్ స్టాల్ చేసుకోవచ్చా ? లేదా ? అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని యాప్‌ డెవలపర్స్‌కు సూచించింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

Read More : Unemployed Man Suspects Wife : భార్యపై అనుమానం… పాశవికంగా 10 సార్లు కత్తితో పోడిచి హత్య

ట్రెండింగ్ వార్తలు