Unemployed Man Suspects Wife : భార్యపై అనుమానం… పాశవికంగా 10 సార్లు కత్తితో పోడిచి హత్య

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త,  ఆమెను పాశవికంగా హత్య చేసిన ఘటన ముంబైలోని తూర్పు కందివాలిలో చోటు చేసుకుంది.

Unemployed Man Suspects Wife : భార్యపై అనుమానం… పాశవికంగా 10 సార్లు కత్తితో పోడిచి హత్య

Unemployed Man Suspects Wife

Unemployed Man Suspects Wife : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త,  ఆమెను పాశవికంగా హత్య చేసిన ఘటన ముంబైలోని తూర్పు కందివాలిలో చోటు చేసుకుంది. మహేష్ సోని అనే వ్యక్తి డైమండ్ పాలిషింగ్ యూనిట్ లో పని చేసేవాడు. భార్య పూనమ్, కొడుకు శివసోని, ఇద్దరూ కూతుళ్లతో కలిసి తూర్పు కందివాలి పరిధిలోని లోపాయిసర్ సమీపంలో క్రాంతినగర్ లో నివసిస్తున్నాడు.

మహేష్ కు, తన భార్య పూనమ్ ప్రవర్తన పట్ల గత కొంతకాలంగా అనుమానం పెరిగింది. ఈ కారణంగా తరచూ భార్యాభర్తలు గొడవ పడసాగారు. కొన్నేళ్లుగా ఉద్యోగం కూడా పోవటంతో…. కొడుకు శివసోని సంపాదన మీదే కుటుంబం గడుస్తోంది.

శనివారం ఇంట్లో ఉన్న మహేష్ భార్యతో గొడవకు దిగాడు. ఆమెను ఇంట్లోని గదిలోకి తీసుకు వెళ్లి దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి వారికి సర్ది చెప్పబోయారు. మహేష్ వారిని చంపేస్తాననని బెదిరించటంతో వారు వెనక్కి తగ్గారు. కాసేపటి తర్వాత వారు వెళ్లగానే గది తలుపులు వేసిన మహేష్ కత్తితో భార్యను పాశవికంగా పొడిచి హత్య చేశాడు.

గొడవ సర్దుమణిగాక అటువైపు వచ్చిన పొరుగువారు రక్తపు మడుగులో పడి ఉన్నపూనమ్ మృతదేహం చూసి నిశ్చేష్టులయ్యారు. ఆమె కుమారుడు శివసోనీకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన శివ సోనీ పోలీసులకు తండ్రిపై ఫిర్యాదు చేశాడు.

పూనమ్ఒంటిపై 10 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  గత కొన్నేళ్లుగా తన తండ్రి నిరుద్యోగి గా ఉన్నాడని… ఈ మధ్య కాలంలో మహేష్ సోనీ తన కూతుళ్లు ఒంటిమీద బంగారాన్ని కూడా దొంగతనం చేసినట్లు కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.