Google Maps Features : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన గూగుల్ మ్యాప్స్ యాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. మ్యాప్స్ వినియోగదారులు ఇకపై ఏ లొకేషన్ కోసం అయినా వాతావరణం, గాలి నాణ్యత వివరాలను సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో వినియోగదారులు ఇప్పుడు వాతావరణ సూచనలను, రియల్ టైమ్ గాలి నాణ్యత సూచిక సమాచారాన్ని ఈజీగా పొందవచ్చు.
లొకేషన్ ఆధారంగా వాతావరణ సూచనలు :
ముందుగా మ్యాప్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా కావలసిన లొకేషన్ కోసం సెర్చ్ చేయండి. వెదర్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇంకా, వినియోగదారులు అదనపు వివరాలు కూడా పొందవచ్చు. గూగుల్ మ్యాప్స్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్‌లు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. ఈ యాక్టివిటీతో వినియోగదారులకు వాతావరణ నమూనాల గురించి అందిస్తుంది. ప్రయాణ ప్రణాళికలు లేదా బహిరంగ కార్యకలాపాల సమాచారంపై సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు.
Read Also : Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా చౌకైన ధరకు పొందాలంటే?
weather.com నుంచి డేటాను యాక్సస్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు ఆసక్తి ఉన్న నిర్దిష్ట లొకేషన్లకు అనుగుణంగా కచ్చితమైన లేటెస్ట్ వాతావరణ సూచనలను అందజేస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన గూగుల్ మ్యాప్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి. అప్‌డేట్ చేసిన తర్వాత వినియోగదారులు పైన పేర్కొన్న విధంగానే ఫీచర్‌ను యాక్సెస్ చేయగలరు.
అవసరమైనప్పుడు లొకేషన్ షేరింగ్ ఆఫ్ చేయొచ్చు :
అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు వాతావరణం, గాలి నాణ్యత అప్‌డేట్‌లకు మించి అదనపు యాక్టివిటీలను అందిస్తుంది. వినియోగదారులు ఫారెస్ట్ ఫైర్స్, లైవ్ లొకేషన్ షేర్ చేయడం, వారు ఫాలో అయ్యే వ్యక్తుల నుంచి అప్‌డేట్‌లు, ఫొటోలు, రివ్యూలను స్వీకరించడం కోసం యాప్‌ని ఉపయోగించుకోవచ్చు. కానీ, లైవ్ షేరింగ్ అనేది బెస్ట్ ఫీచర్.. దీన్ని పొందడం చాలా సులభం కూడా. లొకేషన్‌లను షేర్ చేయాలనుకునే ఇద్దరు వ్యక్తులు గూగుల్‌లోఒకరినొకరు స్నేహితులుగా యాడ్ చేసుకోవాలి. ఆపై, మీ స్నేహితుడి సమాచారాన్ని చెక్ చేసినప్పుడు ‘షేర్ యూవర్ లొకేషన్’ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ మీరు ఎక్కడ ఉన్నారో లేదా అన్ని సమయాలలో లొకేషన్ షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు కావలసినప్పుడు ఈ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఆఫ్ చేయవచ్చు.
నిర్దిష్ట సమయం తర్వాత కూడా లొకేషన్ షేరింగ్ :
మీరు నిర్దిష్ట సమయాల్లో మీ లొకేషన్ షేరింగ్ చేయడానికి కూడా సెట్ చేయవచ్చు.. అంటే.. ఒకసారి సెట్ చేసిన సమయం ముగిసిన తర్వాత షేరింగ్ నిలిచిపోతుంది. కానీ మీరు ఆప్షన్ ఎంచుకుంటే.. ఆ నిర్దిష్ట సమయం తర్వాత కూడా మీకు కావలసినంత కాలం పాటు మీ లొకేషన్ షేరింగ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు, వాట్సాప్ వంటి యాప్‌లు మీ లొకేషన్‌ను లిమిటెడ్ సమయం వరకు షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అయితే గూగుల్ వెర్షన్ అదనపు యాప్‌లు అవసరం లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించే చాలా మందికి బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు.