Samsung Galaxy S25 Ultra
శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ S25 అల్ట్రా ఒకటిగా నిలిచింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో ధరతో అందుబాటులో ఉంది. ఫోన్ ఫీచర్స్, అలాగే ఈ ఆఫర్‌ను ఎలా పొందవచ్చో చూద్దాం..
ధర తగ్గింపు వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అసలు ధర రూ.1,29,999 (12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్). ఇప్పుడు, శాంసంగ్ ఇండియా స్టోర్‌లో ఈ ఫోన్‌పై రూ.12,000 తగ్గింపు అందుబాటులో ఉంది, దీనితో ధర రూ.1,17,999కి తగ్గుతుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.75,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ బట్టి ఉంటుంది.
ఉదాహరణకు, గెలాక్సీ S24 అల్ట్రాను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.57,650 వరకు తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్ EMI ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, EMI నెలకు రూ.3,278 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ ధర తగ్గింపును పొందడానికి, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ (www.samsung.com) లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లను సందర్శించండి. టైటానియం సిల్వర్‌బ్లూ కలర్ వేరియంట్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అదనంగా, శాంసంగ్ షాప్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 వెల్‌కమ్ బెనిఫిట్ లభిస్తుంది.
Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో.. ఎవరీ సీఈవో, ఎవరామె, ఏంటా వివాదం?
గెలాక్సీ S25 అల్ట్రా ఫీచర్స్
ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యాధునిక ఫీచర్స్‌తో రూపొందించారు. ఇది 6.9-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2తో ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 12GB RAM, 1TB వరకు స్టోరేజ్‌తో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15, వన్ UI 7పై నడుస్తుంది, 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు వస్తాయి.
గెలాక్సీ S25 అల్ట్రా క్వాడ్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది. 200MP ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫొటో (5x ఆప్టికల్ జూమ్), 10MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్). సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరాలు గెలాక్సీ AI ఫీచర్స్ తో ఉన్నాయి. లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, రైటింగ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఎందుకు కొనాలి?
గెలాక్సీ S25 అల్ట్రా దాని S పెన్ సపోర్ట్, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, అత్యాధునిక కెమెరా సామర్థ్యాలతో ఉన్న ఒక శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్ ఇది. పరిమిత కాల ఆఫర్ కాబట్టి, త్వరగా నిర్ణయం తీసుకోండి. ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. తాజా ఆఫర్‌ల కోసం శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ చూడొచ్చు.