Google Photos
Google Photos : ఆన్‌లైన్ యూజర్లకు గుడ్ న్యూస్.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఫొటోస్ కోసం అద్భుతమైన ఏఐ ఫీచర్లను ఉచితంగా అందిస్తోంది. ఇప్పటికే, గూగుల్ ఫోటోస్ (Google Photos)లో అనేక ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇటీవలే గూగుల్ అనేక సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్ల సాయంతో వినియోగదారులు తమ పాత జ్ఞాపకాలను మరింత క్రియేటివిటీగా మార్చుకోవచ్చు.
ఇప్పుడు ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా గూగుల్ ఫొటోస్ ద్వారా అనేక ఫొటోలతో వీడియోను క్రియేట్ చేయొచ్చు. అంతేకాదు.. ఫొటోలను యానిమేషన్, కామిక్స్, స్కెచ్‌లు లేదా 3D యానిమేషన్‌లు వంటి అద్భుతమైన స్టయిల్లోకి మార్చవచ్చు. ప్రస్తుతం గూగుల్ ఫొటోస్‌కు కొత్త ట్యాబ్ క్రియేట్ అయింది. ఈ ట్యాబ్ కింద కంపెనీ అన్ని క్రియేటీటీ ఏఐ టూల్స్ అందిస్తోంది. గూగుల్ ఫొటోస్ కొత్త ఫీచర్లు ఏంటి? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ ఫోటోస్‌లో కొత్త AI టూల్స్ :
గూగుల్ ఫొటోస్ యూజర్లకు ఏఐ టూల్స్ మరింత క్రియేటివిటీని అందిస్తాయి. ఆసక్తిగల వినియోగదారులు తమ పాత ఫోటోలను సరికొత్తగా స్టయిల్‌గా మార్చవచ్చు. ఈ ఏఐ టూల్స్ కోసం ఇకపై ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు. గూగుల్ ఫొటోస్ ద్వారానే మీకు నచ్చినట్టుగా ఫొటోలను క్రియేట్ చేయొచ్చు.
ఈ ఏఐ ఫీచర్లను టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంచినట్టు గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. అందుకే వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ అడుగుతోంది. ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలు, వీడియోలపై థంబ్స్-అప్ లేదా థంబ్స్-డౌన్ ఇవ్వడం ద్వారా వినియోగదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. గూగుల్ యూజర్లు ఇప్పుడు గూగుల్ ఫొటోస్‌లో పాత ఫొటోలను వీడియోలుగా క్రియేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే Gemini, YouTubeలో అందుబాటులో ఉంది. గూగుల్ కొత్త Veo 2 మోడల్ ఆధారిత కొత్త ‘ఫొటో టు వీడియో’ ఫీచర్ సాయంతో మీరు పాత ఫొటోలను వీడియోలుగా క్రియేట్ చేయొచ్చు. కొంతకాలం క్రితమే (MyHeritage) వంటి యాప్‌లు బాగా పాపులర్ పొందాయి. గతంలో, ఈ యాప్ ద్వారా తమ ఫ్యామిలీ పాత ఫొటోలను యానిమేట్ చేసేవారు. ఇప్పుడు ఏఐ సాయంతో మరింత ఈజీగా మారింది.
ఫోటో నుంచి వీడియో ఎలా జనరేట్ చేయాలి? :
ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో Android, iOS డివైజ్‌ల్లో మాత్రమే ఈ ఏఐ ఫీచర్ అందుబాటులో ఉంది. లేటెస్ట్ ఏఐ ఫీచర్లు స్టాటిక్ ఫొటోలను ఆకర్షణీయమైన షార్ట్ వీడియోలు, స్టయిలీష్‌గా మారుస్తాయి. ఈ టూల్ ద్వారా వినియోగదారులు ఏదైనా ఫొటోను ఎంచుకుని డైనమిక్ 6-సెకన్ల వీడియోగా మార్చవచ్చు. ముందుగా మీరు ఏదైనా మీ పాత ఫోటోను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
మెంటల్ స్టేటస్ లేదా క్రియేటివిటీకి తగినట్టుగా స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. “Subtle movements” లేదా “I’m feeling lucky” వంటి ప్రాంప్ట్స్ ఎంచుకోవచ్చు. YouTube, Geminiలో కూడా ఇలాంటి ఫీచర్‌లు కనిపించాయి. కానీ, ఈ ఇంటిగ్రేషన్ ఆ యాక్టివిటీని నేరుగా ఫొటో గ్యాలరీ యాప్‌లోకి రీడైరెక్ట్ చేస్తుంది. పర్సనల్ కంటెంట్‌ను మీకు నచ్చినట్టు గతంలో కన్నా అద్భుతంగా అందంగా క్రియేట్ చేయొచ్చు.
రీమిక్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
గూగుల్ మరో కొత్త ఫీచర్ రీమిక్స్. గూగుల్ ఇమేజెన్ AI మోడల్‌లో రన్ అవుతుంది. మీరు మీ ఫోటోలలో దేనినైనా కొన్ని సెకన్లలో విభిన్న స్టయిల్లోకి మార్చవచ్చు. ఈ ఫీచర్ కొన్ని వారాల్లో అమెరికాలో ఆండ్రాయిడ్, iOS యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది.
AI వీడియోలను ఇలా గుర్తుపట్టొచ్చు :
గూగుల్ ఫొటోస్‌లో ఏఐతో క్రియేట్ చేసిన అన్ని ఫొటోలు, వీడియోలకు ఒక ప్రత్యేకమైన వాటర్‌మార్క్ ఉంటుంది. దీన్నే SynthID డిజిటల్ వాటర్‌మార్క్ అంటారు. ఈ ఫొటో లేదా వీడియో ఏఐ క్రియేట్ అయిందని సూచిస్తుంది. అంటే.. ఎవరూ ఈ ఏఐ ఫీచర్‌ను దుర్వినియోగం చేయలేరు. గూగుల్ ఫొటోస్ ఇప్పటికే Reimagine వంటి AI టూల్స్ సవరించిన ఫొటోలకు ఈ వాటర్‌మార్క్‌ను అప్లయ్ చేస్తుంది.
వచ్చే ఆగస్టులో క్రియేట్ ట్యాబ్ :
గూగుల్ కంపెనీ వచ్చే ఆగస్టు 2025లో “Create” అనే ట్యాబ్ గూగుల్ ఫొటోస్‌కు యాడ్ చేయనుంది. ఈ ట్యాబ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. దీనికి కొత్త టూల్స్, ఎక్స్‌పర్మెంట్స్ యాడ్ చేస్తుంటుంది. పాత టూల్స్ కూడా అప్‌గ్రేడ్ చేస్తుంటుంది. యూట్యూబ్ షార్ట్స్ కోసం గూగుల్ ఇలాంటి ఏఐ టూల్స్‌ను కూడా ప్రవేశపెట్టింది.
యూట్యూబ్ షార్ట్స్‌లో ఇప్పుడు ఫొటోల నుంచి వీడియోలను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కొత్త AI ఎఫెక్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ Veo 2 మోడల్‌లో రన్ అవుతాయి. ఈ వేసవిలో యూట్యూబ్ షార్ట్స్ Veo 3కి యాక్సెస్ పొందుతాయని గూగుల్ వెల్లడించింది.