Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోందోచ్.. భారత్ లాంచ్ డేట్, ధర, డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొత్తం 4 మోడళ్లు రాబోతున్నాయి..

Apple iPhone 17
Apple iPhone 17 : ఆపిల్ అభిమానుల కోసం అతి త్వరలో కొత్త ఐఫోన్ సిరీస్ రాబోతుంది. వచ్చే సెప్టెంబర్ 2025లో ఆపిల్ బిగ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 17 సిరీస్ (Apple iPhone 17) లాంచ్ చేసే అవకాశం ఉంది. అందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే 4 కొత్త ఐఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రాబోయే ఈ ఐఫోన్ 17 సీరిస్ మోడళ్లకు సంబంధించి ఇప్పటివరకు ధర రేంజ్ నుంచి కెమెరా స్పెషిఫికేషన్ల వరకు అనేక లీక్‌లు బయటకు వచ్చాయి. ఐఫోన్ 17 సిరీస్ భారీ అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. బేస్ వేరియంట్ గత మోడల్ కన్నా అత్యంత పవర్ ఫుల్ ఫీచర్లు కలిగి ఉండొచ్చు.
ఐఫోన్ 17 లాంచ్ తేదీ, ధర, కలర్ ఆప్షన్లు Apple iPhone 17 :
బ్లూమ్‌బెర్గ్‌కు మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10, 2025 మధ్య మార్కెట్లోకి రానుంది. భారతీయ మార్కెట్లో ఐఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 79,999 ఉండవచ్చు. ఈ ఐఫోన్ టీల్, వైట్, పింక్, బ్లాక్, అల్ట్రామెరైన్ అనే 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో రావచ్చు. ఆపిల్ నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఐఫోన్ 17 డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు Apple iPhone 17 :
ఆపిల్ ఐఫోన్ 17 గత మోడల్ డిజైన్ అలాగే ఉంచే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని ఇతర 3 ఐఫోన్లలా కాకుండా ఐఫోన్ 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో సహా డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. చూసేందుకు అచ్చం ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. ఇందులో సెన్సార్ మార్పు అంటే.. 12MP ఫ్రంట్ స్నాపర్ నుంచి 24MPకి మారనుంది. రాబోయే అన్ని కొత్త ఐఫోన్‌లలో ఇదే ఉండొచ్చు.
రాబోయే ఐఫోన్ 17 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే కలిగి ఉండొచ్చు. ఇది జరిగితే.. ఐఫోన్ 17 గత ఫోన్లతో పోలిస్తే మెరుగైన స్ట్రీమింగ్, వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 8GB ర్యా్మ్, బేసిక్ బ్యాటరీతో రావచ్చు. ఆపిల్ ఐఫోన్ 17 పాత ఆపిల్ A18 చిప్‌సెట్‌తో రన్ అవుతుందనే పుకార్లు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా.. ఆపిల్ లేటెస్ట్ A19 ప్రాసెసర్‌తో బేస్ వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది.