Google Pixel 9 Price : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. ఆగస్టు 20నే పిక్సెల్ 10 లాంచ్.. పిక్సెల్ 9పై భారీగా తగ్గింపు.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?
Google Pixel 9 Price : గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ రాకముందే పిక్సెల్ 9 ధర తగ్గింది. డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో తక్కువకే లభిస్తోంది.

Google Pixel 9 Price
Google Pixel 9 Price : పిక్సెల్ ఫోన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఆఫర్.. ఆగస్టు 20న మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే (Google Pixel 9 Price) గూగుల్ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గింది. ఈ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 ఫోన్ గత ఏడాదిలో లాంచ్ కాగా, ఇప్పుడు భారీ తగ్గింపు ధరకే లభ్యమవుతోంది.
ప్రీమియం పిక్సెల్ 9 ఫోన్ ప్రారంభ ధర రూ.79,999 ఉండగా ఫ్లాట్ డిస్కౌంట్లు, కార్డ్ ఆఫర్లతో ఇప్పుడు విజయ్ సేల్స్‌లో ధర రూ.67,999కే అందుబాటులో ఉంది. ఈ పిక్సెల్ 9 కొనాలా వద్దా? లేదా నెక్స్ట్ జనరేషన్ మోడల్ పిక్సెల్ 10 కోసం వేచి ఉండాలా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
విజయ్ సేల్స్‌లో పిక్సెల్ 9 ధర తగ్గింపు (Google Pixel 9 Price) :
విజయ్ సేల్స్‌లో పిక్సెల్ 9 ఫోన్ 256GB వేరియంట్ ప్రస్తుతం రూ. 5వేలు డైరెక్ట్ డిస్కౌంట్ తర్వాత రూ. 74,999కు లిస్టు అయింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 7వేలు తగ్గింపుతో వస్తుంది. ఫైనల్ ధర రూ. 67,999కు తగ్గుతుంది. మొత్తం రూ. 12వేలు సేవ్ చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Google Pixel 9 Price) :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.3-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ పొందవచ్చు. గూగుల్ టెన్సర్ G4 చిప్ ద్వారా పవర్ పొందుతుంది.
7 ఏళ్ల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10.5MP ఫ్రంట్ షూటర్‌ను పొందవచ్చు. ఇవన్నీ 4700mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా సపోర్టు అందిస్తుంది.
పిక్సెల్ 9 కొనాలా? వద్దా? :
గూగుల్ పిక్సెల్ 10 భారీ అప్‌గ్రేడ్‌లతో రానుందని అంచనా. ఫస్ట్ టైమ్ బేస్ మోడల్‌లో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉండనుంది. పిక్సెల్ 10 ఇదే ధర వద్ద లాంచ్ అయితే.. పిక్సెల్ 9 ధర కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం పిక్సెల్ 9 ఫోన్ తగ్గినప్పటికీ, ఆగస్టు 20 వరకు ఆగితే మరింత తగ్గింపు పొందే అవకాశం ఉంది.