Google Pixel 10 Discount (Image Credit To Original Source)
Google Pixel 10 : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? కొన్ని నెలల క్రితమే గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమెరా ఫీచర్లు, ప్రీమియం లుక్‌తో ఈ ఫోన్ ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. మీరు ఈ పిక్సెల్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. మీ బడ్జెట్ ధరలోనే పిక్సెల్ 10 ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు :
2025 ఆగస్టులో ఈ ఫోన్ 6.3-అంగుళాల OLED స్క్రీన్‌తో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది. ఫొటోలు, వీడియోల కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 48MP ప్రైమరీ లెన్స్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్, 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియోల కోసం 10.5MP లెన్స్ కూడా ఉంది. గూగుల్ 4970mAh బ్యాటరీతో అమర్చింది. రాబోయే 7 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ అందుకోవచ్చు.
Google Pixel 10 Discount : (Image Credit To Original Source)
అమెజాన్‌లో అద్భుతమైన డీల్స్ :
భారతీయ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 9,700 ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత రూ. 70,299కి లిస్ట్ అయింది. అదనంగా, రూ. 2,108 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. దాంతో ధర రూ. 68,191కి తగ్గుతుంది. మీరు గూగుల్ పిక్సెల్ 10లో రూ. 11,800 కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5Gపై భారీ తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G కూడా ప్రస్తుతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. దేశీయ మార్కెట్లో రూ. 129,999 ధరకు లాంచ్ కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 98,500 ధరకు లభిస్తోంది.