×
Ad

Google Pixel 10 Pro : మీరు నమ్మలేని ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Google Pixel 10 Pro : అమెజాన్ ఆఫర్ అదిరింది భయ్యా.. గూగుల్ పిక్సెల్ 10ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/5
Google Pixel 10 Pro : పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మీరు లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం పిక్సెల్ 10 ప్రోపై రూ.12,300కు పైగా తగ్గింపు అందిస్తోంది.
2/5
ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ ధర కన్నా సరసమైన ధరకే లభిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ ముగియకముందే కొనేసుకోవడం బెటర్. మీరు ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/5
గూగుల్ పిక్సెల్ 10 ప్రో అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో రూ.1,09,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ పిక్సెల్ 10 ప్రోపై ధర రూ.8,599 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ ధర రూ.1,01,400కు తగ్గింది. దాంతోపాటు, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,750 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌పై కూడా ట్రేడ్ చేయవచ్చు.
4/5
పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందిస్తుంది. హుడ్ కింద ఈ హ్యాండ్‌సెట్ టెన్సర్ G5 చిప్‌సెట్, టైటాన్ M2 చిప్‌తో అమర్చి ఉంటుంది, 16GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఇంకా, పిక్సెల్ 10 ప్రో ఫోన్ 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,870mAh బ్యాటరీని అందిస్తుంది.
5/5
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 10 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP వైడ్-యాంగిల్, 48MP అల్ట్రా-వైడ్ మాక్రో ఫోకస్, 48MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే, ఈ డివైజ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 42MP కెమెరాను కలిగి ఉంది.