Google Pixel 10 Pro XL (Image Credit To Original Source)
Google Pixel 10 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మీరు కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. గత ఆగస్టులో భారత మార్కెట్లో ప్రీమియం గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు అమెజాన్‌లో పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ భారీ తగ్గింపు ధరకు లభ్యమవుతుంది.
డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ధర రూ. 1.10 లక్షల కన్నా తక్కువగా లభిస్తోంది. సాఫ్ట్‌వేర్, కెమెరా పర్ఫార్మెన్స్, లాంగ్ టైమ్ సపోర్టు అందిస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో పిక్సెల్ ఫోన్ ధర రూ. 16వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందింది. మీరు కూడా ఈ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తుంటే అమెజాన్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ ప్రారంభ ధర రూ.1,24,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ పిక్సెల్ ఫోన్ ఇప్పుడు రూ.1,11,570కు లిస్ట్ అయింది. ఇప్పటికే రూ.13,429 డిస్కౌంట్ అందిస్తోంది.
Google Pixel 10 Pro XL (Image Credit To Original Source)
అంతేకాదు.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ.3,347 విలువైన అమెజాన్ పే బ్యాలెన్స్ పొందవచ్చు. మీరు రెండు ఆఫర్‌లతో మొత్తం సేవింగ్ రూ.16,776కు పెరుగుతుంది. ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా ఉంది. మీ పాత ఫోన్ మోడల్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ.44,300 వరకు ఉండవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. గూగుల్ టెన్సర్ G5 చిప్, 3nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. అన్ని స్టోరేజ్ వేరియంట్‌లలో 16GB ర్యామ్ ఉంది.
పిక్సెల్ ఫోన్ అంటేనే కెమెరాల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అందులోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరింత అద్భుతంగా ఉంటుంది. పోర్ట్రెయిట్‌ల నుంచి లాంగ్-రేంజ్ జూమ్ వరకు ఫొటోలు ఆకర్షణీయంగా ఉంటాయి.
ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? :
వాస్తవానికి, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ లాంచ్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు అమెజాన్‌లో కొంటే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ప్రస్తుతం రూ. 1.10 లక్షల లోపు ధరలో పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ లభిస్తోంది. అద్భుతమైన కెమెరాలు, సాఫ్ట్‌వేర్ సపోర్టు పరంగా చూస్తే ఇలాంటి ఫోన్ ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు. మీరు కొనాలనుకుంటే ఈ పిక్సెల్ ఫోన్ కొనడమే బెటర్.