Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ వచ్చేసింది భయ్యా.. ఈ 5 ఫీచర్లు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా.. ఏమున్నాయ్‌ మావా..

CPU పనితీరు టెన్సర్ G4తో పోలిస్తే 34% ఎక్కువ. కొత్త చిప్‌సెట్‌లో పూర్తిగా కస్టమ్ ఇమేజింగ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉంది. దీని వల్ల ఫొటోలు, వీడియోల నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

Google Pixel 10 Series

Google Pixel 10 Series: గూగుల్ ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో పిక్సెల్ 10 సిరీస్‌ను లాంచ్ చేసింది. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ విడుదలయ్యాయి. వీటితో పాటు పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, పిక్సెల్ వాచ్ 4, బడ్స్ 2a, బడ్స్ 2 ప్రో కొత్త కలర్ ఆప్షన్‌ను కూడా విడుదల చేసింది. తాజా పిక్సెల్ డివైస్‌లు ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వచ్చాయి.

కొత్త ఏఐ ఫీచర్లు

ఈ సంవత్సరం పిక్సెల్ డివైస్‌ల ముఖ్య ఆకర్షణ ఏఐ ఫీచర్లు. అందులో ‘మ్యాజిక్ క్యూ’ ఫీచర్ మరింత ప్రత్యేకం. ఇది పర్సనలైజ్డ్ ఇంటెలిజెన్స్ అందించి, సంబంధిత సమాచారాన్ని క్యూకార్డ్ రూపంలో చూపిస్తుంది. ఎయిర్‌లైన్‌కి కాల్ చేసినా, ఎయిర్‌బిఎన్‌బి అడ్రెస్ వెతికినా సాయం చేస్తుంది. ‘కెమెరా కోచ్’ ఫీచర్ ద్వారా సరైన ఫొటో క్లిక్ చేసేందుకు సూచనలు వస్తాయి.

‘జెమినీ అసిస్టెంట్’ మరింత స్మార్ట్ అయి, దగ్గరలో రెస్టారెంట్లు సెర్చ్‌ చేయడం, ప్రత్యేక నోట్స్‌తో ఈవెంట్లు షెడ్యూల్ చేయడం, ఈమెయిల్స్ నుంచి ట్రావెల్ ప్లాన్స్ తీసుకోవడం వంటి పనులు చేస్తుంది. (Google Pixel 10 Series)

‘జెమినీ లైవ్’ సహజమైన హ్యాండ్స్‌ఫ్రీ సంభాషణలు అందిస్తుంది. స్క్రీన్, ఇమేజెస్, ఫైల్స్, యూట్యూబ్ వీడియోలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో రియల్ టైమ్‌లో షేర్ చేసుకోవచ్చు.

Also Read: Rare Lizard: వీడెవడండీ బాబూ.. అరుదైన బల్లిని వండి, ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్.. ఆ తర్వాత అసలు కథ షురూ..

ప్రో-గ్రేడ్ కెమెరాలు

పిక్సెల్ 10 సిరీస్‌లో పూర్వ మోడల్స్‌తో పోలిస్తే మెరుగైన కెమెరా సిస్టమ్స్ వచ్చాయి. ప్రో సిరీస్‌లో ట్రిపుల్ కెమెరా సెట్‌ప్, అప్గ్రేడ్ చేసిన టెలిఫోటో లెన్స్ ఉంది. ఇది 100x ప్రో రెస్ జూమ్ ఇస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ (మాక్రో సెన్సార్‌గానూ పనిచేస్తుంది) ఉన్నాయి. ప్రో సిరీస్‌లో వీడియో బూస్ట్, నైట్ సైట్ వీడియో, 8K వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి.

పిక్సెల్ 10లో కూడా మెరుగైన కెమెరా సిస్టమ్ ఉంది. 5x టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెట్‌ప్ ఉంది. ఇది 20x ప్రో రెస్ జూమ్ ఇస్తుంది. 48 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా HDR+ తో, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 10.5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా (ఆటోఫోకస్‌తో) ఉన్నాయి. కెమెరా కోచ్ ఫీచర్ మెరుగైన ఫోటోలు తీయడంలో సహాయపడుతుంది.

డిజైన్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్

  • పిక్సెల్ 10 సిరీస్ స్పేస్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారై, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
  • పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌తో సహా మొత్తం సిరీస్‌కి IP68 రేటింగ్ ఉంది. దీనివల్ల నీటి, దుమ్ము నిరోధకత ఉంటుంది.
  • గూగుల్ 7 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్, పిక్సెల్ డ్రాప్ అప్‌డేట్స్ ఇస్తుందని ప్రకటించింది.

పిక్సెల్‌స్నాప్

మాగ్నెటిక్ ఛార్జింగ్ టెక్నాలజీ ‘పిక్సెల్‌స్నాప్’ పేరుతో వచ్చింది. ఇది ఐఫోన్‌లో ఉన్న మ్యాగ్‌సేఫ్‌లా పనిచేస్తుంది. పిక్సెల్ 10 సిరీస్ డివైస్‌లను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయవచ్చు. క్యూఐ2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

పిక్సెల్‌స్నాప్ ఛార్జర్‌తో పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ 25W స్పీడ్ ఇస్తుంది. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ 15W వరకు సపోర్ట్ చేస్తాయి.

పిక్సెల్‌స్నాప్ ద్వారా ఛార్జర్ విత్ స్టాండ్, రింగ్ స్టాండ్ వంటి యాక్సెసరీస్‌తో పాటు కార్ మౌంట్స్, ఛార్జర్స్, గ్రిప్స్, వాలెట్స్ వంటి వేలాది యాక్సెసరీస్ కూడా ఉపయోగించవచ్చు.

గూగుల్ టెన్సర్ G5

పిక్సెల్ 10 సిరీస్‌లో గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్ ఉన్నాయి. కొత్త చిప్‌సెట్ 60% మెరుగైన ఆన్-డివైస్ ఏఐ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

CPU పనితీరు టెన్సర్ G4తో పోలిస్తే 34% ఎక్కువ. కొత్త చిప్‌సెట్‌లో పూర్తిగా కస్టమ్ ఇమేజింగ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉంది. దీని వల్ల ఫొటోలు, వీడియోల నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

ధర 

పిక్సెల్ 10 ధర రూ.79,999, పిక్సెల్ 10 ప్రో రూ.1,09,999, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ రూ.1,24,999.  భారత్‌లో ఈ సిరీస్ 256GB వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. అమెరికా వంటి దేశాల్లో వేరువేరు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నప్పటికీ భారత్‌లో పరిమితంగా లభిస్తోంది.