Google Pixel 7 Pro Discount : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Google Pixel 7 Pro : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7 ప్రో భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Google Pixel 7 Pro gets massive discount on Flipkart

Google Pixel 7 Pro Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రత్యేకించి ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 8 మోడల్ 2023లో లాంచ్ అయినప్పటికీ.. పిక్సెల్ 7 ప్రో అక్టోబర్ 2022లో లాంచ్ అయింది.

Read Also : Top 5 Gadgets 2024 : ఈ కొత్త ఏడాదిలో మీ ప్రియమైన వారికి టాప్ 5 గాడ్జెట్లను సర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు..!

ఒక ఏడాది కన్నా ఎక్కువ సమయం అయినప్పటికీ ఆకట్టుకునే కెమెరాతో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న యూజర్లకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కొనుగోలుకు ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ పిక్సెల్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మొత్తం ధరను రూ. 30వేలు తగ్గించవచ్చు.

గూగుల్ పిక్సెల్ 7 ప్రో డిస్కౌంట్ :
గూగుల్ పిక్సెల్ 7 ప్రో మార్కెట్‌లో రూ.84,999కి విడుదలైంది. అయితే ఇప్పుడు, పిక్సెల్ 7 ప్రో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 58,999కి కొనుగోలు చేయవచ్చు. 31 శాతం తగ్గింపును అందిస్తుంది. అంటే.. వినియోగదారులు దాదాపు రూ.26వేలు ఆదా చేసుకోవచ్చు. దీనితో పాటు, ఈ ఫోన్ ధరను తగ్గించడానికి వినియోగదారులు అనేక బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ డీల్ గూగుల్ పిక్సెల్ 7తో పాటు లాంచ్ అయిన 12జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ మోడల్‌కు వర్తిస్తుందని గమనించాలి. అలాగే, ఈ ప్రత్యేక ఆఫర్ ఫోన్ హాజెల్, అబ్సిడియన్ స్నో అనే మూడు రంగుల వేరియంట్‌లలో విస్తరించింది.

Google Pixel 7 Pro massive discount

గూగుల్ పిక్సెల్ 7 ప్రో టాప్ స్పెషిఫికేషన్లు :
ఈ ఫోన్ టాప్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మూత్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతోంది. ఈ డివైజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ బలమైన 4926ఎంఎహెచ్ బ్యాటరీతో ఆధారితమైనది. 30డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

హుడ్ కింద, పిక్సెల్ 7 ప్రో ఆక్టా-కోర్ టెన్సర్ జీ2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. వివిధ అప్లికేషన్‌లు, టాస్క్‌లలో సమర్థవంతమైన పర్పార్మెన్స్ అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. పిక్సెల్ 7 ప్రోలో 5జీ, 4జీ సామర్థ్యాలు, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

అందువల్ల, ఫోన్ కనెక్ట్‌గా ఉండటానికి సమగ్రమైన ఆప్షన్లను అందిస్తుంది. ఫోటోగ్రఫీలో ఉన్నవారికి, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 10ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. వెనుక వైపుకు వస్తున్నప్పుడు ఫోన్ పవర్‌ఫుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రధాన కెమెరా, 48ఎంపీ టెలిఫోటో లెన్స్, 12ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. విభిన్న దృశ్యాలలో కొన్ని అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది.

Read Also : Redmi Note 13 5G Series : ఈ నెల 4న రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెషిఫికేషన్లు లీక్..!