×
Ad

Google Pixel 9a : ఇది కదా ఆఫర్ అంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ అతి చౌకైన ధరకే.. ఇప్పుడే కొనేసుకోండి!

Google Pixel 9a : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌‌లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ మీకోసమే..

1/6
Google Pixel 9a : గూగుల్ కొత్త పిక్సెల్ ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో వైడ్ రేంజ్ ప్రొడక్టులపై అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్‌లను పొందవచ్చు. పండుగ ఆఫర్లను పొందడానికి ఇదే సరైన సమయం.
2/6
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ రూ. 10వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ ధరకే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను పొందాలని చూస్తున్న వారికి అద్భుతమైన అవకాశం. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ తక్కువ ధరకు ఎలా పొందాలంటే?
3/6
గూగుల్ పిక్సెల్ 9a ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ధర రూ.49,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ.44,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం పిక్సెల్ 9aపై రూ.5వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దాంతోపాటు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.5వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ట్రేడ్ చేయవచ్చు.
4/6
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఫుల్ HD+ (1080 x 2424 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 422.2 పీపీఐతో కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. హెచ్‌డీఆర్ కంటెంట్ కోసం డిస్‌ప్లే 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లెవల్స్ అందిస్తుంది. 2700 నిట్స్ వద్ద గరిష్టంగా ఉంటుందని గూగుల్ పేర్కొంది.
5/6
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
6/6
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 9a మోడల్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అంతేకాదు.. ఈ పిక్సెల్ ఫోన్ 5,100mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.