Google Pixel 9a : భలే ఉందిగా కొత్త పిక్సెల్ 9a ఫోన్.. లాంచ్‌కు ముందే వీడియో లీక్.. కెమెరా ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. మార్కెట్లో ఇతర బ్రాండ్లకు పోటీగా మిడ్ రేంజ్ ఫోన్లకు దీటుగా రానుంది. లాంచ్‌కు ముందే ఈ పిక్సెల్ 9a ఫీచర్లు లీక్ అయ్యాయి.

Google Pixel 9a

Google Pixel 9a Launch : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. బహుశా మార్చి 19న లాంచ్ అవుతుందని పుకార్లు వస్తున్నాయి.

కానీ, గూగుల్ ఇంకా ఈ పిక్సెల్ ఫోన్ రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక యూట్యూబర్ అధికారిక ఛానెల్‌లో హ్యాండ్-ఆన్ వీడియోను పోస్టు చేయడంతో కొత్త లీక్ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఫోన్ డిజైన్, కెమెరాలను సూచిస్తుంది. ఈ లీక్ గత పుకార్లకు దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.

Read Also : Yamaha FZ-S Fi : వారెవ్వా.. సూపర్ బైక్.. యమహా FZ-S Fi హైబ్రిడ్ అదుర్స్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలుసా?

పిక్సెల్ 9a హ్యాండ్-ఆన్ వీడియో లీక్ :
గూగుల్ పిక్సెల్ 9a లీక్‌లను యూట్యూబర్ అలెక్సిస్ గార్జా షేర్ చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశాడు. రెజ్లింగ్ ఈవెంట్‌లో ఫోన్‌తో యూట్యూబ్ షార్ట్స్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో పిక్సెల్ 9a కెమెరా ఇంటర్‌ఫేస్‌ను సూచిస్తుంది.

0.5x, 1x, 2x జూమ్ ఆప్షన్లతో హై-స్పీడ్ మూవెంట్స్ క్యాప్చర్ చేయగలదు. లీకైన ఫుటేజ్ కూడా బ్లాక్ కలర్ వేరియంట్‌ను సూచిస్తుంది. ఈ కలర్ ‘అబ్సిడియన్’గా పిలుస్తారు. గూగుల్ ట్రెడేషనల్ నేమింగ్ స్కీమ్ ఆధారంగా రూపొందించింది. కెమెరా బార్ బ్యాక్ ప్యానెల్‌లో కలిసిపోయినట్లు కనిపిస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే.. మరింత సూక్ష్మమైన డిజైన్‌ను అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ తేదీలివే :
నివేదికల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ మార్చి 19, 2025న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 26 నాటికి అమెరికా, యూరప్‌లో సేల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గూగుల్ గత లాంచ్ ట్రెండ్‌లను పరిశీలిస్తే.. పిక్సెల్ 9a భారత మార్కెట్లో కూడా అదే తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

భారత్, అమెరికాలో ధరలు (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ధర పిక్సెల్ 8a ధర మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలో 128జీబీ మోడల్ ధర USD 499 (సుమారు రూ. 43,100), 256GB వేరియంట్ ధర USD 599 (సుమారు రూ. 51,800)గా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

భారత మార్కెట్లో గత లాంచ్‌లను పరిశీలిస్తే.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ రూ.52,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, 256జీబీ వెర్షన్ ధర దాదాపు రూ.64వేలు కావచ్చు. స్టోరేజ్ వేరియంట్‌ల మధ్య ధరల్లో రూ.10వేల కన్నా ఎక్కువ తేడా ఉండవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9a ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లు (అంచనా) :
పర్ఫార్మెన్స్, డిస్‌‌ప్లే : గూగుల్ పిక్సెల్ 9ఎ గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. 8జీబీ (LPDDR5X) ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. మెరుగైన భద్రత విషయానికి వస్తే.. టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను కూడా కలిగి ఉండవచ్చు.

ఈ పిక్సెల్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. లీకైన రెండర్‌లు పిక్సెల్ 9 సిరీస్ మాదిరిగానే రీడిజైన్ చేసిన ఫ్రంట్ కెమెరా, రౌండెడ్ ఎడ్జెస్ ఉండనున్నట్టు సూచిస్తున్నాయి.

Read Also : Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ మార్చిలో హ్యుందాయ్ కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్..!

కెమెరా, బ్యాటరీ (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో రావచ్చు. 5,100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 23W వైర్డ్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో రావచ్చు.

కలర్ ఆప్షన్లు :
128జీబీ మోడల్ : ఐరిస్, అబ్సిడియన్, పియోనీ, పింగాణీ అనే 4 కలర్ ఆప్షన్లలో రానుంది.
256GB మోడల్ : ఐరిస్, అబ్సిడియన్ అనే ఇది కలర్ ఆప్షన్లలో రావచ్చు.