Google Pixel Buds Pro : ఫిక్సల్ బడ్స్ ప్రో.. పిక్సెల్ 6a 5G ఫోన్ కూడా.. ప్రీ-ఆర్డర్లు ఎప్పటినుంచంటే?

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రొడక్టుల్లో ఒకటైన పిక్సెల్ బడ్స్ ప్రో ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 28న భారత మార్కెట్లో న్యూ రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను రిలీజ్ చేయనుంది.

Google Pixel Buds Pro India Launch Date Confirmed, Pixel 6a 5g Could Tag Along

Google Pixel Buds Pro : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రొడక్టుల్లో ఒకటైన పిక్సెల్ బడ్స్ ప్రో ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 28న భారత మార్కెట్లో న్యూ రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు గూగుల్ ధృవీకరించింది. ఇప్పటికే లాంచ్ కానున్న Google Pixel 6a 5G ఫోన్ కూడా Pixel Buds Proతో పాటు ట్యాగ్ చేసే అవకాశం ఉంది. పిక్సెల్ బడ్స్ ప్రో ఇండియా లాంచ్ ఎప్పుడు అనేది సోషల్ మీడియా పోస్ట్ గూగుల్ వెల్లడించింది. Facebook యూజర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. Google Facebook పేజీలో పోస్టు చేసింది. TWS భారత మార్కెట్లో జూలై 28న లాంచ్ కానుందనిధృవీకరించింది. Google కొత్త ఇయర్‌బడ్‌ల కోసం ప్రీ-ఆర్డర్‌లు జూలై 21 నుంచి భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి.

యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, తైవాన్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో పిక్సెల్ బడ్స్ ప్రో మేలో Google I/O 2022లో లాంచ్ అయింది. ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి సపోర్టు ఇచ్చే Google ఫస్ట్ TWS అని చెప్పవచ్చు. 6-కోర్ ఆడియో కస్టమ్-బిల్ట్ చిప్‌తో వచ్చింది. ఇయర్‌బడ్‌లు మెరుగైన గ్రిప్ నాయిస్ క్యాన్సిలేషన్, సిలికాన్ టిప్స్ ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ANC ఆన్‌తో గరిష్టంగా ఏడు గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. ANC లేకుండానే Google Pixel Buds Pro గరిష్టంగా 11 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని అంటోంది. ఇయర్‌బడ్‌లు Google అసిస్టెంట్‌కు సపోర్ట్‌తో పాటు 40 భాషల్లో రియల్-టైం ట్రాన్స్‌లేషన్‌తో వస్తాయి. Pixel 6a 5G కూడా అదే రోజున భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

Google Pixel Buds Pro India Launch Date Confirmed, Pixel 6a 5g Could Tag Along 

గూగుల్ పిక్సెల్ 6a 5G ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 8MP ఫ్రంట్ కెమెరాతో టాప్ సెంటర్లో హోల్-పంచ్ కటౌట్‌తో వచ్చింది. వెనుకవైపు, Google Pixel 6a కెమెరా సెటప్‌లో 12.2MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4410mAh బ్యాటరీ, Google టెన్సర్ చిప్‌ను కూడా అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. చివరగా, Pixel 6a ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. Google Pixel 6a ధర, ఆఫర్లకు సంబంధించి అధికారిక లాంచ్ తర్వాత వెల్లడించనుంది. ఈ ఫోన్ అమెరికాలో $449 (దాదాపు రూ. 35,600)కి లాంచ్ అయింది. భారత మార్కెట్లో Pixel 6a ధర సుమారుగా రూ. 45,000 వరకు ఉండవచ్చునని అంచనా.

Read Also : Chromecast : క్రోమ్‌క్యాస్ట్ సపోర్టుతో ఇండియాకు గూగుల్ టీవీ.. ధర ఎంతంటే?