Google: వినియోగదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైన గూగుల్.. మీ ఖాతాలు క్లోజ్ కాకుండా ఇలా చేయండి ..

గూగుల్ పరిధిలో పనిచేసే ఖాతాలను మీరు రెండేళ్ల పాటు లాగిన్ కాకుంటే ఆ ఖాతా పోతుంది. దీనికితోడు అందులో దాచుకున్న కంటెంట్ కూడా తొలగించబడుతుంది.

Google

Gmail Acount : గూగుల్ సంస్థ తన వినియోగదారులకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో మిలియన్ల కొద్దీ ఇన్‌యాక్టివ్ జీ మెయిల్ ఖాతాలను మూసేయబోతుంది. ఈ ప్రక్రియను డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనుంది. చాలాకాలంగా నిరుపయోగంగా ఉన్న జీ మెయిల్ ఖాతాలు గూగుల్ శాశ్వతంగా తొలగించనుంది. అదే జరిగితే మీరు మరోసారి మీ జీ మెయిల్ లాగిన్ అవ్వలేరు. మీ అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లోనూ జీ మెయిల్ ఉపయోగించలేరు.

Also Read : ISRO VSSC Vacancies 2023 : ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో డ్రైవర్ పోస్టుల భర్తీ..

గూగుల్ పరిధిలో పనిచేసే ఖాతాలను మీరు రెండేళ్ల పాటు లాగిన్ కాకుంటే ఆ ఖాతా పోతుంది. దీనికితోడు అందులో దాచుకున్న కంటెంట్ కూడా తొలగించబడుతుంది. సదరు ఖాతాదారు భవిష్యతులో తన ఖాతాను యాక్సెస్ చేయలేరు. వినియోగదారులు గూగుల్ ఫొటోల బ్యాకప్ ను కూడా పొందలేరు. అయితే, డిసెంబర్ మొదటి వారం నుంచి గూగుల్ ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఖాతాను తొలగించే ముందు వారికి నోటిఫికేషన్ లు వస్తాయి. మెయిల్ ఖాతాలో కూడా సందేశం వస్తుంది. ఖాతా మూసివేయడానికి కొద్దిరోజుల ముందు గూగుల్ సందేశాలను పంపడం ప్రారంభిస్తుంది.

Also Read : ODI World Cup 2023 : కేఎల్ రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్లు అక్రమ్, మలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇలా చేయండి ..
జీ మెయిల్, అనేక ఇతర ఖాతాలు గూగుల్ ఖాతా సహాయంతోనే కొనసాగుతాయని అందరికీ తెలిసిన విషయమే. గత రెండు సంవత్సరాలుగా మీ గూగుల్ ఖాతాను ఉపయోగించకుంటే వచ్చే నెల నుంచి మీ ఖాతాను తొలగించే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఇలా చేయండి.
– గూగుల్ డ్రైవ్ (Google Drive) ని ఉపయోగించడం.
– య్యూటూబ్ (youtube) వీడియోలను చూడటం లేదా ఇతరులకు పంపించుకోవటం.
– ప్లే స్టోర్ (play store) నుంచి యాప్ ను డౌన్లోడ్ చేయడం.
– గూగుల్ శోధన (Google Search)ను ఉపయోగించి ఏదైనా వెతకడం.
– ఏదైనా మూడవ పక్షం యాప్ లేదా వెబ్ సైట్ మొదలైన వాటికి లాగిన్ చేయడానికి గూగుల్ ఖాతాను ఉపయోగించడం.
ఇలా చేయడం ద్వారా గూగుల్ సంస్థ.. గూగుల్ కు అనుసంధానంగా ఉన్న మీ ఖాతాలను తొలగించదు.