ISRO VSSC Vacancies 2023 : ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో డ్రైవర్ పోస్టుల భర్తీ..

ISRO VSSC రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలకు సంబంధించి లైట్ వెహికల్ డ్రైవర్-A 9 పోస్టుల ఖాళీలు. హెవీ వెహికల్ డ్రైవర్- B పోస్టులకు 9 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. రెండు కలిపి 18 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

ISRO VSSC Vacancies 2023 : ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో డ్రైవర్ పోస్టుల భర్తీ..

ISRO VSSC Vacancies 2023

Updated On : November 13, 2023 / 12:50 PM IST

ISRO VSSC Vacancies 2023 : ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైట్ వెహికల్ డ్రైవర్- A, హెవీ వెహికల్ డ్రైవర్ A ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు 18 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 13న ప్రారంభమవుతుంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీగా నవంబర్ 27గా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.vssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

READ ALSO : SBI Recruitment 2023 : రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. SBI లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

ఖాళీల వివరాలు ;

ISRO VSSC రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలకు సంబంధించి లైట్ వెహికల్ డ్రైవర్-A 9 పోస్టుల ఖాళీలు. హెవీ వెహికల్ డ్రైవర్- B పోస్టులకు 9 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. రెండు కలిపి 18 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

READ ALSO : Anti ageing tips : చర్మం మెరుస్తూ, యవ్వనంగా కనిపించాలంటే కొల్లాజెన్ కీలకమా ? దీనిని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే !

విద్యా అర్హత:

లైట్ వెహికల్ డ్రైవర్ పోస్టులకు అభ్యర్థులు SSLC/SSC/Matric/10th ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఎల్‌విడి లైసెన్స్‌ని కలిగి ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవర్‌గా మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

హెవీ వెహికల్ డ్రైవర్ A పోస్టులకు అభ్యర్థులు SSC/SSC/Matric/10th ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా HVD లైసెన్స్‌ని కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్‌ని కలిగి ఉండాలి.

READ ALSO : Gold Biscuits : ఎవుర్రా బాబూ నువ్వు! బంగారం బిస్కెట్లు ఎక్కడ దాచాడో చూడండి.. అయినా దొరికిపోయాడు.. వీడియో వైరల్

ఎంపిక ప్రక్రియ ;

ISRO VSSC రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ కు సంబంధించి మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తరువాత దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు దశల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీ చెల్లిస్తారు.

పూర్తి వివరాలకు అభ్యర్థులు www.vssc.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.