Gold Biscuits : ఎవుర్రా బాబూ నువ్వు! బంగారం బిస్కెట్లు ఎక్కడ దాచాడో చూడండి.. అయినా దొరికిపోయాడు.. వీడియో వైరల్

తిరుచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల ఏడు బంగారం బిస్కెట్లు, 94 గ్రాములు బంగారు ఆభరణాలను కస్ట్సమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Gold Biscuits : ఎవుర్రా బాబూ నువ్వు! బంగారం బిస్కెట్లు ఎక్కడ దాచాడో చూడండి.. అయినా దొరికిపోయాడు.. వీడియో వైరల్

Gold

Customs Department : రెండు వేరువేరు సంఘటనల్లో తిరుచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుండి భారీ విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలి ఘటనలో తిరుచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల ఏడు బంగారం బిస్కెట్లు, 94 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ప్రయాణికుడు తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చినట్లు కస్ట్సమ్ అధికారులు తెలిపారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 47 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Also Read : Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధర .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం, కిలో వెండి ధరలు ఎంతంటే?

సదరు వ్యక్తి బంగారం ఎరికీ కనిపించకుండా తరలించే ప్రయత్నం చేశాడు. పాయింట్ నడుం భాగంలో బెల్టు పెట్టుకొనే ప్రదేశంలో చుట్టూరా గోల్డ్ బిస్కెట్ల ను పెట్టి స్టిచ్చింగ్ చేశాడు. అతని అతితెలివిని ఎవరూ గుర్తించలేరని భావించాడో ఏమో.. కానీ, తిరుచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రయాణికుడి వద్ద పాయింట్ తీసుకొని దాని నుంచి ఏడు బంగారం బిస్కెట్లను వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Delhi Thick Smog : దీపావళి ఎఫెక్ట్, ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు

అదే విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరో ప్రయాణికుడి నుంచి సుమారు 60 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించారు. ప్రయాణికుడు తన ప్రైవేట్ పార్ట్ లో బంగారం పేస్ట్ లాంటి పదార్థాలను తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని బంగారం పొడిని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ప్రయాణికుడు విమానాశ్రయానికి చేరుకున్న తరువాత తనిఖీల్లో భాగంగా అధికారులు అతన్ని గుర్తించారు.