Anti ageing tips : చర్మం మెరుస్తూ, యవ్వనంగా కనిపించాలంటే కొల్లాజెన్ కీలకమా ? దీనిని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే !

చర్మం ఆరోగ్యంకోసం కొన్ని రుచికరమైన కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ తినాలనుకునే వారు స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్ లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు తీసుకోవటం మంచిది.

Anti ageing tips : చర్మం మెరుస్తూ, యవ్వనంగా కనిపించాలంటే కొల్లాజెన్ కీలకమా ? దీనిని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే !

Look Younger

Updated On : November 13, 2023 / 11:06 AM IST

Anti ageing tips : చర్మం మెరుస్తూ. యవ్వనంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కాలుష్యం, హానికరమైన UV కిరణాలు, టాక్సిన్‌లు చర్మానికి నష్టం కలిగిస్తాయి. దీని వల్ల మన చర్మ ఆరోగ్యం ప్రతిరోజూ క్షీణిస్తుంది. ఈ కారకాలు అకాల చర్మ వృద్ధాప్యానికి దారితీసేందుకు కారణమవుతాయి. కొల్లాజెన్ అనేది చర్మం ఆరోగ్యంగా , మెరుపుదనంతో ఉండేందుకు సహాయపడుతుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుకునేంకదు మంచిఆహారాలు, సప్లిమెంట్స్ బాగా ఉపయోగపడతాయి.

READ ALSO : Bindi Benifits : మహిళలు బొట్టు పెట్టుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుందట.. నిపుణులు చెబుతున్నారు

కొల్లాజెన్ అనేది చర్మానికి మృదుత్వాన్ని, దృఢత్వాన్ని ఇచ్చే ప్రోటీన్. చర్మాన్ని నిత్యం నవయవ్వనంగా ఉంచటంలో కీలకమైనది. సహజంగానే వయస్సు పెరిగే కొద్దీ మన చర్మం తక్కువ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో సహజ కొల్లాజెన్ ఉత్పత్తి 25 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం 1% తగ్గుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిలో తగ్గుదల వృద్ధాప్యానికి దారి తీస్తుంది. దీని వలన చర్మంపై సన్నని గీతలు, ముడతలు ఏర్పడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, ఉత్తేజపరిచేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి.

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహజ పద్దతులను అనుసరించడం ద్వారా చర్మం యవ్వనంగా ఆకర్షించేలా ఉండేలా చేసుకోవచ్చు. తగినంత నీరు త్రాగడం, కఠినమైన రసాయన ఆధారిత ఉత్పత్తులను చర్మంపై వాడకపోవటం, రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడుక్కోవడం వంటివి చర్మ సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక అంశాలు. అంతేకాకుండా చర్మం లో కొల్లాజెన్ ఉత్పత్తిని నేరుగా పెంచే కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

READ ALSO : Healthy Skin : ఆరోగ్యకరమైన చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఇవే !

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు ;

1. సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి ప్రేరేపించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యాంటీఆక్సిడెంట్‌ కావటం వల్ల, విటమిన్ సి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఫ్రీరాడికల్స్ అనేవి చర్మకణాలకు హానికలిస్తాయి.

2. బ్రోకలీ

బ్రోకలీలో నారింజలో ఉన్నంత విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లకు కూడా పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. ఈ పోషకం సహజ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

READ ALSO : Diabetes Affects The Skin : మధుమేహం చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? ఈ లక్షణాల కనిపిస్తే జాగ్రత్త పడటం మంచిది..

3. బెర్రీలు

చర్మం ఆరోగ్యంకోసం కొన్ని రుచికరమైన కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ తినాలనుకునే వారు స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్ లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు తీసుకోవటం మంచిది. అవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాకుండా UV-ప్రేరిత నష్టాన్నినివారించటంలో సహాయపడతాయి.

4. వెల్లుల్లి

ఇప్పటి వరకు మనం వెల్లుల్లిని వంటకాలకు రుచికోసం మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ అది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుందని చాలామందికి తెలియదు. వెల్లుల్లిలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేసే కారకంగా చెప్పవచ్చు.

READ ALSO : Best Skin Oils : ఈ ఆయిల్స్ వాడితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది!

5. బీన్స్

బీన్స్ కొల్లాజెన్ ఉత్పత్తి సహాయపడే సహజ వనరులలో ఒకటి. ప్రోటీన్-రిచ్ ఫుడ్, కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన మరొక పోషకం.

చర్మ సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వోలైట్, డెర్మల్ ఫిల్లర్స్ , ప్రొఫిలో వంటి ఇంజెక్షన్‌లు అద్భుతమైన కొల్లాజెన్ బూస్టర్‌లు. ఇవి చర్మం యొక్క ఉపరితలం క్రింద హైలురోనిక్ యాసిడ్‌ను ఇంజెక్ట్ చేయడం, కొల్లాజెన్ , ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రేరేపించడం,చర్మం మృధువుగా , యవ్వన రూపాన్ని అందిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి పొడులు, మాత్రలు మొదలైన వాటి రూపంలో కొల్లాజెన్ సప్లిమెంట్లను నిపుణులు సిఫార్సు మేరకు తీసుకోవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.