SBI Recruitment 2023 : రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. SBI లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ) ఉన్నాయి.

Specialist Cadre Officer Posts in SBI
SBI Recruitment 2023 :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 27గా నిర్ణయించారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ను పరిశీలించి ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO : python : ఇంటి వరండాలో పెద్ద కొండచిలువ…భయంతో కెవ్వున అరిచిన మహిళ
అర్హతలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు :
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ) ఉన్నాయి.
వయో పరిమితి ;
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 25 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.
READ ALSO : Indian Overseas Bank Recruitment 2023 : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. భారీ స్ధాయిలో వేతనం
దరఖాస్తు రుసుము ;
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750. SC/ST/PWBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ ;
ఈ పోస్టులకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
అనుభవం ;
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ)పోస్టులకు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ ర్యాంక్ కంటే తక్కువ లేని అధికారి లేదా ఇండియన్ నేవీ / ఎయిర్‌ఫోర్స్‌లో కనీసం 5 సంవత్సరాల కమీషన్డ్ సర్వీస్‌తో సమానమైన ర్యాంక్ అనుభవం ఉండాలి. లేదంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ / డిప్యూటీ సూపరింటెండెంట్ / అసిస్టెంట్ కమాండెంట్ / డిప్యూటీ కమాండెంట్ ఆఫ్ ఇండియన్ పోలీస్ / పారా-మిలటరీ దళాల స్థాయి కంటే తక్కువ లేని అధికారి, అటువంటి దళంలో అధికారిగా కనీసం 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.
READ ALSO : Sai Dharam Tej : ఎంత పని చేశావు వరుణ్.. ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..
మేనేజర్ (సెక్యూరిటీ) పోస్టులకు కనీసం 10 సంవత్సరాల కమీషన్ సర్వీస్‌తో ఇండియన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ లేదా ఇండియన్ నేవీ / ఎయిర్‌ఫోర్స్‌లో తత్సమాన ర్యాంక్ కంటే తక్కువ లేని అధికారిగా పనిచేసి ఉండాలి. లేదంటే డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి / ఇండియన్ పోలీస్ / పారా-మిలటరీ దళాల డిప్యూటీ కమాండెంట్, అటువంటి దళంలో అధికారిగా కనీసం 10 సంవత్సరాల సేవలు అందించి ఉండాలి.
దరఖాస్తు చేసే విధానం ;
స్టేజ్1: అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
స్టేజ్ 2: నోటిఫికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టేజ్ 3: ముందుగా సూచనలు, నియమాలు చదివి, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సబ్ మిట్ చేయాలి. తరువాత ప్రత్యేక ఐడి జనరేట్ అవుతుంది.
స్టేజ్ 4: అనతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్టేజ్ 5: భవిష్యత్ అవసరాలకోసం అప్లికేషన్ ఫీజు పేమెంట్ వివరాలను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకొవాలి.