Sai Dharam Tej : ఎంత పని చేశావు వరుణ్.. ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..

తాజాగా సాయి ధరమ్ తేజ్.. వరుణ్ లావణ్య పెళ్లి నుంచి ఆసక్తికర ఫొటోలు షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

Sai Dharam Tej : ఎంత పని చేశావు వరుణ్.. ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్..

Sai Dharam Tej Shares Interesting Photos From Varun Lavanya Marriage post goes Viral

Updated On : November 13, 2023 / 11:49 AM IST

Sai Dharam Tej : ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ అంతా వెళ్లి సందడి చేశారు. ఇప్పటికే వరుణ్ లావణ్య పెళ్లి ఫొటోలు చాలా బయటకి రాగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్.. వరుణ్ లావణ్య పెళ్లి నుంచి ఆసక్తికర ఫొటోలు షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

తేజ్, వరుణ్ బావ బామ్మర్దులు అవుతారని తెలిసిందే. మెగా ఫ్యామిలీ కజిన్స్ అంతా ఎప్పుడూ సరదాగా కలిసే ఉంటారు. పండగలు, పార్టీలు కలిసే సెలెబ్రేట్ చేసుకుంటారు. వీరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. తాజాగా తేజ్ షేర్ చేసిన ఫొటోల్లో.. వరుణ్ కార్ లో పెళ్లి వేదిక వద్దకు వెళ్తుంటే తేజ్ మధ్యలో ఆపేసి కార్ మీద కాలు పెట్టి ఎందుకు చేసుకుంటున్నావ్ పెళ్లి, సింగిల్ లైఫ్ ని వదిలేస్తున్నావు అంటూ సరదాగా ప్రశ్నించాడు.

Also Read : Varun Lavanya : పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ దీపావళి.. అత్తారింట్లో లావణ్య ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి..

ఈ ఫోటోలను షేర్ చేసిన తేజ్.. ఎందుకు? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టాడు. అయితే ఇదంతా పెళ్ళిలో సరదాగా జరిగిందే అని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు తేజ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. గతంలో వరుణ్.. పెళ్లిపై కామెడీగా తీసిన F2, F3 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)