python : ఇంటి వరండాలో పెద్ద కొండచిలువ…భయంతో కెవ్వున అరిచిన మహిళ

ఇంటి వరండాలో తలుపు వద్ద ఓ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఇంట్ల నుంచి వరండాలోకి వచ్చింది. వరండాలో భారీ కొండచిలువ దర్శనమివ్వడంతో కెవ్వున అరిచింది....

python : ఇంటి వరండాలో పెద్ద కొండచిలువ…భయంతో కెవ్వున అరిచిన మహిళ

python

Updated On : November 13, 2023 / 12:04 PM IST

python : ఇంటి వరండాలో తలుపు వద్ద ఓ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఇంట్ల నుంచి వరండాలోకి వచ్చింది. వరండాలో భారీ కొండచిలువ దర్శనమివ్వడంతో కెవ్వున అరిచింది. ఇంటి లోపలకు పరుగెత్తిన మహిళ సమాచారం అందించడంతో పాములు పట్టే సంస్థ ప్రతినిధి వచ్చి దాన్ని పట్టుకొని తీసుకువెళ్లి అడవిలో వదిలి వేశారు. క్వీన్స్‌లాండ్‌లోని సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ 24/7 అనే పాములు పట్టే సంస్థ ఈ ఘటన గురించి ఫేస్‌బుక్‌లో పంచుకుంది.

ALSO READ : Leopard : దీపావళి పటాకులకు భయపడి చిరుతపులి ఏం చేసిందంటే…

‘‘ఓ మహిళ ఈ ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన వరండాలో నిలబడగా పెద్ద కొండచిలువను చూసి భయపడింది. ఆమె తన కుక్కలను లోపలికి తీసుకువెళ్లి వెంటనే స్నేక్ క్యాచర్స్ ను పిలిచింది.మేం వెంటనే వెళ్లాం. కొండచిలువను పై నుంచి కిందకు దింపడానికి కొంత సమయం పట్టింది, మేం దాన్ని తీసుకువెళ్లి అడవిలో వదిలివేశాం’’ అని సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ తెలిపింది.

ALSO READ : Pragya Jaiswal : పండగ పూట కూడా హాట్ నెస్ చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఓ వ్యక్తి కొండచిలువను పట్టుకుంటున్న వీడియోను కూడా షేర్ చేశారు. క్లిప్‌లో కొండచిలువ పైకప్పుపై ఉండగా దాన్ని ఒక వ్యక్తి మెల్లగా కొండచిలువ దగ్గరికి వచ్చి, ఒక రాడ్ ఉపయోగించి దాన్ని కిందకు దించారు. ఒకసారి కొండచిలువను పట్టుకుని దాన్ని సంచిలో పెట్టుకుని అడవిలో వదిలేశారు. ఈ వీడియోను 65వేలమంది వీక్షించారు. మరో 2వేల మంది లైక్ చేశారు. పలువురు కామెంట్లు చేశారు.