Indian Overseas Bank Recruitment 2023 : ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. భారీ స్ధాయిలో వేతనం

అర్హులైన అభ్యర్ధులు నవంబరు 19 లోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iob.in పరిశీలించగలరు.

Indian Overseas Bank Recruitment 2023 : ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. భారీ స్ధాయిలో వేతనం

Indian Overseas Bank Recruitment 2023

Updated On : November 13, 2023 / 11:35 AM IST

Indian Overseas Bank Recruitment 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. చెన్నై ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తోన్న ఈ బ్యాంకులో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Anti ageing tips : చర్మం మెరుస్తూ, యవ్వనంగా కనిపించాలంటే కొల్లాజెన్ కీలకమా ? దీనిని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే !

విద్యార్హతలు:

లా, బీఈ/బీటక్‌/ఎంటెక్‌, బీఆర్క్‌, ఏదైనా డిగ్రీ , సీఏ/ఎంసీఎ/ ఎమ్మెస్సీ/ఎంబీఏ/పేజీడీబీఎం, సీవీసీఏ/సీఏ ఉత్తీర్ణతులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

పని అనుభవం:

సంబంధిత విభాగాల్లో కొంత కాలం పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఏప్రాంతాలోని ఐఓబీ ప్రాంచిలోనైనా పనిచేయాల్సి ఉంటుంది.

వేతనం:

పోస్టులను బట్టి కనిష్టంగా రూ.48 వేలు నుంచి గరిష్టంగా రూ.8వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ కాలం ఉంటుంది.

READ ALSO : Man Sets Wine Shop On Fire : మద్యం ఇవ్వలేదని వైన్ షాష్ కు నిప్పంటించిన వ్యక్తి

వయో పరిమితి:

అభ్యర్థుల వయస్సు 25 నుండి 40 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుం:

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు కేవలం ఇంటిమేషన్‌ ఛార్జీల కింద రూ.175 చెల్లించాలి. ఇతరులు (ఓబీసీ/ ఈడబ్య్యూఎస్‌ కలిపి) రూ.850లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

READ ALSO : Helicopter Crash : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్…అయిదుగురి మృతి

ఎంపిక విధానం:

ఆన్‌లైన్‌ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు గడువు ;

అర్హులైన అభ్యర్ధులు నవంబరు 19 లోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iob.in పరిశీలించగలరు.