Google Uses Dead Nexus Phone To Make Fun Of Iphone 13
Google uses dead Nexus phone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ అయింది. ఈ ఐఫోన్ మోడల్ మార్కెట్లోకి రావడంతోనే భారీగా ట్రోలింగ్ మొదలైంది. నెటిజన్లతో పాటు పోటీదారు కంపెనీలు సైతం కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నాయి. జొమాటో ఐఫోన్ 13 డిజైన్ పై ట్రోల్ చేసింది. ఇప్పుడు అల్ఫాబెట్ దిగ్గజం గూగుల్ కూడా ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ పై ట్రోల్ చేసింది. పైగా ఇది ఫన్ అంటోంది. గూగుల్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ పై ట్రోల్ చేసింది. 9to5Google నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 14న iPhone 13 సిరిస్ ఆపిల్ ఆవిష్కరించింది.
Apple iPhone 13: ఇండియాలో అదేరోజు.. ఆపిల్ ఐఫోన్ 13 గ్లోబల్ లాంచ్!
అదే రోజున Google Nexus అకౌంట్ నుంచి గూగుల్ ఒక ట్వీట్ చేసింది. అందులో నేను #Pixel6 కోసం వేచి ఉంటాను. వాస్తవానికి ఈ నెక్సస్ ఫోన్ మోడల్ ను గూగుల్ ఎప్పుడో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో లేదు. డెడ్ నెక్సస్ ఫోన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి గూగుల్ ఈ ట్వీట్ చేసింది. ఈ ఏడాది చివరిలో గూగుల్ పిక్సెల్ 6 (Google Pixel 6) శ్రేణి ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి గూగుల్ ట్వీట్ చేసిన అకౌంట్లో చివరి పోస్టు అక్టోబర్ 16, 2017లోది. ఆ ట్వీట్ గూగుల్ పిక్సెల్ 2 కోసం పాత్ ఫోన్ తో ట్రేడ్ చేసింది. 2019 నుంచి అకౌంట్లో ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఐఫోన్ లాంచ్ తర్వాత గూగుల్ చేసిన ఈ ట్వీట్ ఒక మిలియన్ లైక్‌లు వచ్చాయని నివేదిక పేర్కొంది.
ఫ్లాగ్‌షిప్ వార్ ఫోన్లలో ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌తో నేరుగా పోటీపడుతోంది. గూగుల్ ఇప్పటికే రెండు పిక్సెల్ ఫోన్ (Pixel 6, Pixel 6 pro)లను ప్రకటించింది. అక్టోబర్ నుంచి ఈ రెండు ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఆపిల్ నుంచి లాంచ్ అయిన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో iphone 13, iphone 13mini, iphone 13pro , iphone 13 pro Max నాలుగు కొత్త ఐఫోన్ వేరియంట్లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. సెప్టెంబర్ 17 నుంచి భారత మార్కెట్ సహా అనేక దేశాలలో ప్రీ-ఆర్డర్ స్టార్ట్ అవుతోంది. ఐఫోన్ 12 కంటే ఐఫోన్-13లో పెద్దగా స్పెషికేషన్లలో మార్పులు లేవు.
ఐఫోన్ 13 వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్, కొత్త కెమెరా, వీడియో రికార్డింగ్ మోడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. Pixel 6 ఫోన్ కావాలంటే మరింత సమయం వేచిచూడక తప్పదు. ఇప్పటివరకు, టెక్ దిగ్గజం రాబోయే పిక్సెల్ ఫోన్‌లు ఇండియాలో రిలీజ్ అవుతాయో లేదో క్లారిటీ ఇవ్వలేదు. గత రెండు ఏళ్లుగా గూగుల్ ఇండియా మార్కెట్‌కు దూరమైంది. ఇప్పటికీ గూగుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించలేదు. గూగుల్ పిక్సెల్ 6 భారత మార్కెట్లోకి వస్తుందా లేదా చూడాలి.
Harm iPhone Cameras : ఐఫోన్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్.. మీ కెమెరాలు భద్రం!