Harm iPhone Cameras : ఐఫోన్ యూజ‌ర్లకు ఆపిల్ వార్నింగ్.. మీ కెమెరాలు భద్రం!

ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ తమ యూజర్లను అలర్ట్ చేస్తోంది. ఐఫోన్ కెమెరాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తోంది. ఈ మేరకు ఆపిల్ ఒక కొత్త స‌పోర్ట్ పేజీని పబ్లీష్ చేసింది.

Harm iPhone Cameras : ఐఫోన్ యూజ‌ర్లకు ఆపిల్ వార్నింగ్.. మీ కెమెరాలు భద్రం!

Motorcycle Engines May Harm Iphone Cameras

Harm iPhone Cameras : ప్రపంచ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ తమ యూజర్లను అలర్ట్ చేస్తోంది. ఐఫోన్ కెమెరాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తోంది. ఈ మేరకు ఆపిల్ సంస్థ ఒక కొత్త స‌పోర్ట్ పేజీని పబ్లీష్ చేసి అందులో ఈ విషయాన్ని హైలెట్ చేసింది. హైప‌వ‌ర్ బైకులపై వెళ్తున్న స‌మ‌యంలో మోటారు సైకిళ్ల ఇంజిన్ల నుంచి విడుదలయ్యే పవర్ ఫుల్ వైబ్రేషన్ల వల్ల ఐఫోన్ కెమెరా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆపిల్ హెచ్చరించింది. ఆపిల్ రిలీజ్ చేసిన దాదాపు ఐఫోన్ మోడళ్లలో మోడ్రాన్ టెక్నాలజీతో కూడిన కెమెరా సిస్టమ్ అమర్చింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ క్లోజ్డ్-లూప్ ఆటోఫోకస్ వంటి టెక్నాలజీలతో ఉన్నాయి.

ఈ సిస్టమ్‌లు ఆటోమాటిక్‌గా మూమెంట్, వైబ్రేషన్‌లు, గురుత్వాకర్షణ ప్రభావాలను అడ్డుకుంటాయి. కదిలే సమయంలో కలిగే వైబ్రేషన్లతో ఐఫోన్ కెమెరా దెబ్బతినకుండా ఈ ఫీచర్లు ప్రొటెక్ట్ చేస్తాయని తెలిపింది. కానీ, ఐఫోన్‌ను ఎక్కువ మొత్తంలో వైబ్రేష‌న్స్ రిలీజ్ చేసే హైప‌వ‌ర్ మోటార్ సైకిల్స్‌కు అటాచ్ చేయొద్దని ఆపిల్ యూజ‌ర్ల‌కు సూచిస్తోంది. సాధారణంగా బైక్ హ్యాండిల్‌కు ఐఫోన్ వంటి మొబైళ్లను అటాచ్ చేస్తుంటారు. అప్పుడు బైక్ నుంచి వ‌చ్చే వేబ్రేష‌న్స్ మీ ఫోన్ కెమెరాను దెబ్బ తీసే ప్ర‌మాదం ఉంద‌ని ఆపిల్ హెచ్చరించింది.
Apple : ఐఫోన్-13 విడుదలపై నెట్టింట రచ్చ.. ఆపిల్ మూఢనమ్మకాలను నమ్ముతుందా?

మీ మోటార్‌సైకిల్‌పై ఐఫోన్‌ మౌంట్ చేస్తే.. :
మీ ఐఫోన్‌ను మోపెడ్‌లు, స్కూటర్లు వంటి చిన్న-వాల్యూమ్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్‌లతో అటాచ్ చేయడం వల్ల తక్కువగా వైబ్రేషన్‌లు ఉంటాయని తెలిపింది. కానీ, అలా చేస్తే మీ ఐఫోన్ దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించడానికి వైబ్రేషన్ డంపింగ్ మౌంట్ అమర్చాలని సూచిస్తోంది. OIS, AF సిస్టమ్స్ ద్వారా కెమెరాలకు నష్టం కలగకుండా తీవ్రతను తగ్గించవచ్చునని తెలిపింది. అలా అని దీర్ఘకాలం కూడా వాడటం మంచిదికాదని ఆపిల్ పేర్కొంది. మీ మోటార్‌సైకిల్‌పై ఏదైనా ఐఫోన్‌ను మౌంట్ చేస్తే.. దాని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆటో ఫోకస్ దెబ్బతినవచ్చని ఆపిల్ హెచ్చరించింది. పవర్ ఫుల్ వైబ్రేషన్‌లకు గురికావడం వల్ల OIS, AF పర్ఫార్మెన్స్ తగ్గిపోవచ్చునని సూచించింది. ఇక కెమెరా ఫోటోలు, వీడియోల క్వాలిటీని కూడా దెబ్బతీస్తుందని పేర్కొంది. ఆపిల్ తమ యూజర్లు ఐఫోన్‌లను పవర్ ఫుల్ వైబ్రేషన్‌లకు గురికాకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తోంది.

మీరు మీ మోటార్‌సైకిల్‌పై ఐఫోన్‌ను మౌంట్ చేస్తే.. OIS సిస్టమ్ కలిగిన ఏ ఐఫోన్ అయినా ప్రభావానికి గురికావొచ్చు. iPhone 6 Plus, iPhone 6s Plus, iPhone 7 తరువాత ఐఫోన్ SE (2 జనరేషన్) లో OIS అందుబాటులో ఉంది. ఐఫోన్ 11 ఫోన్‌లోని అల్ట్రా-వైడ్ కెమెరా తరువాత OIS సిస్టమ్ అందుబాటులో లేదు. iPhone 7 Plus, iPhone 8 Plusలోని టెలిఫోటో కెమెరాలు లేవు. క్లోజ్డ్-లూప్ AF iPhone XSలో తరువాత iPhone SE (2 జనరేషన్)తో సహా ఆ తర్వాత వచ్చిన అన్ని ఐఫోన్లలో అందుబాటులో ఉంది. ఆపిల్ తదుపరి లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 14న నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు ఆపిల్ వాచ్ 7, ఎయిర్‌పాడ్స్ 3 మరిన్ని ప్రొడక్టులను ఆపిల్ లాంచ్ చేయనుంది.
Apple iPhone 13 Series : ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే?