Apple : ఐఫోన్-13 విడుదలపై నెట్టింట రచ్చ.. ఆపిల్ మూఢనమ్మకాలను నమ్ముతుందా?

ఐఫోన్ - 13 సిరీస్ విడుదలపై సోషల్ మీడియా వేదికగా హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.. సెప్టెంబర్ 13న ఐఫోన్-13ని ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Apple : ఐఫోన్-13 విడుదలపై నెట్టింట రచ్చ.. ఆపిల్ మూఢనమ్మకాలను నమ్ముతుందా?

Apple

Apple : ఐఫోన్ – 13 సిరీస్ ఫోన్ కోసం మొబైల్ ప్రేమికులు ఎదిరిచూస్తున్నారు. ఈ నెల 14న కాలిఫోర్నియా వేదికగా ఈ మొబైల్ రిలీజ్ చేయనున్నారు. ఈ ఫోన్ కోసం ప్రపంచ వ్యక్తంగా ఉన్న ఐ ఫోన్ లవర్స్ కళ్లలో వత్తులేసుకొని కూర్చున్నారు. ఇక ఈ మొబైల్ రిలీజ్ వేడుకను ఆపిల్ సంస్థ ప్రత్యేక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే ఆపిల్ సంస్థ మూఢనమ్మకాలను నమ్ముతోందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. ఇందుకు కారణం ఐఫోన్ -13 సిరీస్ ను సెప్టెంబర్ 13న రిలీజ్ చేయకుండా.. 14న చేస్తున్నందుకే.. ఈ నేపథ్యంలోనే నెటిజన్ #iPhone14 పేరిట ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

Read More : Big Boss 5: ఎలిమినేషన్‏లో ఆరుగురు.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

ఇలా చేయడానికి కారణం

అనేక పాశ్చాత్యదేశాల్లో 13 నంబర్ ని దురదృష్టసంఖ్యగా భావిస్తారు. ఇది ఆయా దేశాల ప్రజల్లో మూఢనమ్మకంగా పడిపోయింది. 13 సంఖ్యతో కొన్ని దేశాల్లో హోటల్ రూమ్స్ కూడా ఉండవు. బిల్డింగ్ లో 13 ఫ్లోర్ ఉంటే ఆ నంబర్ ఎత్తేస్తారు.. 12 తర్వాత డైరెక్ట్ 14 నంబర్ పెడతారు. కొన్ని విమాన సంస్థలు 13వ నంబర్ ను పూర్తిగా తీసేస్తాయి. విమానం సీరియల్ నంబర్ లోకాని.. లోపల సీట్లలో కానీ 13 నంబర్ ఉండనివ్వరు.

అయితే ఆపిల్ సంస్థ కూడా ఇదే ఫాలో అవుతుందంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ మూఢనమ్మకాన్ని నమ్ముతోంది కాబట్టే ఆపిల్ సెప్టెంబర్ 13న ఐఫోన్ – 13ని రిలీజ్ చేయడం లేదని నెటిజన్లు అంటున్నారు. ఐఫోన్‌-13 నంబర్‌ సిరీస్‌ మొబైల్‌ కొన్నవారిపై, ఆపిల్‌ కంపెనీ దుష్ప్రభావాలు చూపుతోందని ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Read More : Prince Andrew : బ్రిటన్ యువరాజుపై లైంగిక వేధింపుల కేసు

అయితే ఆపిల్ కంపెనీ మాత్రం మూఢనమ్మకాలను నమ్మడం లేదని అర్ధమవుతోంది.. నమ్మితే ఐఫోన్ – 13 సిరీస్ ఎలా తీసుకొస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కావాలనే కొందరు ఐఫోన్ -13 సిరీస్ పై దృష్ప్రచారం చేస్తున్నారని ఆపిల్ కి సపోర్ట్ చేసే నెటిజన్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2010లో ఆపిల్ తన ఐఫోన్ – 4 సిరీస్ ను విడుదల చేసింది.

4 నంబర్ ను ఆసియాలోని కొన్ని దేశాలు డెత్ నంబర్ గా చూస్తాయి. అయినా అటువంటివేమీ పట్టించుకోకుండా 4 సిరీస్ విడుదల చేసింది. ఈ సిరీస్ విడుదలైన గంటల్లోనే మొత్తం ఫోన్లు అమ్ముడుపోయాయి. దీనిని బట్టి చూస్తే ఆపిల్ సంస్థ మూఢనమ్మకాలకు దూరంగా ఉంటుందని అర్ధమవుతుంది.