Prince Andrew : బ్రిటన్ యువరాజుపై లైంగిక వేధింపుల కేసు

బ్రిటన్ యువరాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ మహిళ యువరాజు ఆండ్రూ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేయగా ఈ కేసు నమోదు అయ్యింది.

Prince Andrew : బ్రిటన్ యువరాజుపై లైంగిక వేధింపుల కేసు

Britain's Prince Andrew

Britain’s Prince Andrew sexual assault lawsuit: బ్రిటన్ యువరాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ మహిళ యువరాజు ఆండ్రూ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేయగా ఈ కేసు నమోదు అయ్యింది. దీంతో ప్రిన్స్ ఆండ్రూని లైంగిక వేధింపుల లీగల్‌ పేపర్స్ ను ఆగస్టు 27న అధికారులు అందజేశారు.ఇంగ్లాండ్‌లోని విండ్సర్‌లోని రాయల్ ప్యాలెస్ కు ఈ పేపర్స్ అందజేశారు.

Read more : Queen Elizabeth : సెంచరీ చేరువలో క్వీన్ ఎలిజిబెత్..ఆమె ఆరోగ్యం, ఆయుష్షు సీక్రెట్స్

వర్జీనియా గిఫ్రే అనే మహిళ తాను యుక్తవయసులో ఉన్నప్పుడు తనను ఆండ్రూ లైంగికంగా వేధించాడని ఈ పేపర్స లో ఆరోపించింది. ఈ కేసును వచ్చే సోమవారం (సెప్టెంబర్ 13,2021)న చేపట్టే అవకాశాలున్నాయి. ఈ ఆరోపణలపై స్పందించటానికి ఆండ్రూ అధికార ప్రతినిధి నిరాకరించారు.

తనను 2019లో లైంగిక సుఖం కోసం బ్రిటన్‌ యువరాజు ఆండ్రూకు అప్పుగా ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ ఇచ్చాడని వర్జీనియా గిఫ్రే ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది. ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎఫ్‌స్టెయిన్‌ 2019 లో న్యూయార్క్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం తాను 18ఏల్లకంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు లండన్‌ సోషియల్‌ జిస్లైన్‌ మాక్స్‌వెల్‌ ఇంట్లో తనను ఆండ్రూ లైంగికంగా వేధించాడని ఆరోపించింది.

Read more : పనిమనిషి కావలెను..నెలకు రూ. 18.5 లక్షల జీతం..!!

ఎప్‌స్టెయిన ఇంటితోపాటు వర్జిన్‌ దీవుల్లోని లిటిల్‌ సెయింట్‌ జేమ్స్‌ దీవిలో కూడా ఆండ్రూ తనను దుర్భాషలాడారని గిఫ్రే పేర్కొంది. ఈ ఆరోపణలపై 61 ఏళ్ల ఆండ్రూ స్పందిస్తు.. ఈ ఆరోపణలు ఒట్టి అబద్దాలనీ..ఇదంతా ఆమే కల్పించనవేనని..ఆమె ఎవరో కూడా తనకు తెలియదని..ఆమెను నేను ఎప్పుడు ఎక్కడా కలవలేదని తెలిపారు. ఆమె చేసే ఈ ఆరోపణలతో బ్రిటన్‌ రాజ కుటుంబం పరువుకు భంగం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.