Amazon Great Summer Sale : అతి త్వరలో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపైనే భారీ డిస్కౌంట్లు.. గెట్ రెడీ!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్’ అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Great Summer Sale : అతి త్వరలో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపైనే భారీ డిస్కౌంట్లు.. గెట్ రెడీ!

Amazon Great Summer sale starting soon

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఈ సేల్ ఈవెంట్ గురించి ముందుగానే ప్రకటించింది. కచ్చితమైన సేల్ తేదీలు ఇంకా వెల్లడి కానప్పటికీ, అమెజాన్ ఇండియా అనేక పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందజేయనుంది.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్’ అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లను అందుకోవడానికి కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. బెస్ట్ డీల్స్‌ అందించనుంది.

Read Also : Apple iPhone 16 : ఫిజికల్ బటన్ డిజైన్ లేకుండానే ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ డేటా వెల్లడి!

ఏయే స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఉండొచ్చుంటే? :
ముఖ్యంగా 8 వన్‌ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో OnePlus 12, OnePlus Nord CE 4, OnePlus 12R, OnePlus Nord 3 వంటి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో Redmi 13C, Redmi Note 13 Pro, Samsung Galaxy M34, Xiaomi 14, Samsung Galaxy S23, iQOO Z9, Galaxy S24, Tecno Pova 6 Pro వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్‌లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

ఐఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు? :
కొన్ని కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్‌లను పొందే ఐఫోన్‌ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్‌లో ఆపిల్ డివైజ్‌లు కూడా ఉంటాయని టీజర్ ధృవీకరించింది. ఇంతకుముందు అమెజాన్ విక్రయాల మాదిరిగానే ప్రస్తుత ఐఫోన్ 15 సిరీస్‌లో కొన్ని తగ్గింపు ఆఫర్‌లు ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఎలాంటి షరతులు లేకుండా రూ. 70,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ 15ను రూ. 65,999కి విక్రయిస్తోంది.

బ్యాంకు కార్డులపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
వన్‌కార్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. మిగిలిన వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులు సేల్ ఈవెంట్‌కు ఒక రోజు ముందు అన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ యాక్సెస్ చేయగలరు. అమెజాన్ రాబోయే రోజుల్లో కచ్చితమైన లాంచ్ తేదీలను వెల్లడించనుంది.

Read Also : Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!