Google Chrome Update : గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

Google Chrome Update : క్రోమ్ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ చేసింది. జీరో-డే దుర్బలత్వాన్ని పరిష్కరించేందుకు క్రోమ బ్రౌజర్ కోసం అత్యవసర భద్రతా అప్‌డేట్ తీసుకొచ్చింది. వినియోగదారులు తమ బ్రౌజర్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించింది.

Google wants users to update Chrome browsers as quickly as possible

Google Chrome Update : మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త.. మీ పర్సనల్ డేటాను హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉంది. క్రోమ్ యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచేందుకు గూగుల్ ఇటీవల సరికొత్త సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ అప్‌డేట్ ప్రధానంగా మ్యాక్ఓఎస్, విండోస్, లినక్స్ అంతటా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ అప్‌డేట్ సీవీఈ-2023-6345గా గుర్తించి జీరో-డే దుర్బలత్వాన్ని పరిష్కరించేందుకు రూపొందించింది. ఈ లోపం కారణంగా ప్రభావిత డివైజ్‌లపై కంట్రోల్ పొందేందుకు అనుమతిస్తుంది. క్రోమ్ వినియోగదారులందరూ తమ బ్రౌజర్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని గూగుల్ సూచిస్తోంది.

Read Also : New SIM Card Rules : సిమ్ కార్డులపై కొత్త రూల్స్.. ఈరోజు నుంచే అమల్లోకి.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా!

ఆండ్రాయిడ్ సెంట్రల్ నివేదిక ప్రకారం.. సీవీఈ-2023-6345 లోపాన్ని గురించి సెర్చ్ దిగ్గజం మరిన్ని వివరాలను అందించలేదు, గత వారమే థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ (TAG)లోని భద్రతా పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. ఈ భద్రతా లోపం కారణంగా హాని కలిగించే క్రోమ్ ఇన్‌స్టాలేషన్‌లకు అనుమతి ఇస్తుందని గుర్తించారు.

క్రోమ్‌లో రిస్క్ ఏంటి? :
తెలిసిన విషయమేమిటంటే.. సీవీఈ-2023-6345 అనేది క్రోమ్ గ్రాఫిక్స్ ఇంజిన్‌లోని ఓపెన్ సోర్స్ 2డీ గ్రాఫిక్స్ లైబ్రరీ.. మ్యాక్ఓఎస్ అప్‌డేట్ నోట్స్ (వెర్షన్ 119.0.6045.199)లో వివరించిన విధంగా హానికరమైన ఫైల్ ద్వారా శాండ్‌బాక్స్ ఎస్కేప్‌ను యాక్సస్ చేయగలదు. శాండ్‌బాక్స్ ఎస్కేప్ ప్రమాదకరమైన ముప్పును కలిగిస్తుంది.

ఎందుకంటే.. అర్బిటరీ కోడ్‌ను అమలు చేసి డేటాను దొంగలిస్తుంది. క్రోమ్ బ్రౌజర్ భద్రత, వినియోగదారు సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది. ఈ బగ్ కారణంగా వినియోగదారు డేటాకు అనధికారిక యాక్సెస్‌ను అందిస్తుంది. డేటా మానిప్యులేషన్, ఇతర సైబర్ మోసాలకు దారితీస్తుంది.

Google update Chrome browsers 

ఎలా సురక్షితంగా ఉండాలి? :
ఈ బగ్‌కు సంబంధించిన పూర్తివివరాలను సెర్చ్ దిగ్గజం బహిర్గతం చేయలేదు. క్రోమ్ యూజర్లు అత్యంత అత్యవసరంగా బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. గూగుల్ ఇప్పటికే దుర్బలత్వానికి పరిష్కారాన్ని రిలీజ్ చేసింది. వినియోగదారులు స్టేబుల్ ఛానెల్ మ్యాక్, లినక్స్ కోసం 119.0.6045.199కి విండోస్‌లో 119.0.6045.199/.200కి అప్‌డేట్ చేస్తుంది. రాబోయే రోజులు/వారాల్లో ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వస్తుందని అధికారిక పోస్టు తెలిపింది.

క్రోమ్ బ్రౌజర్‌లలో ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఎంచుకున్న యూజర్లు మ్యానువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌కు ఆటోమాటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. అవసరమైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. అయినప్పటికీ, ఆటోమేటిక్ అప్‌డేట్‌లు నిలిపివేసిన వినియోగదారులు లేదా ఇన్‌స్టంట్ ప్రొటెక్షన్ కోరుకునే యూజర్లు అప్‌డేట్‌ను మాన్యువల్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్ఓఎస్ యూజర్లు 19.0.6045.199 అనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి.

క్రోమ్ బ్రౌజర్ ఇలా అప్‌డేట్ చేసుకోండి :
మీ క్రోమ్ బ్రౌజర్ మాన్యువల్‌గా అప్‌డేట్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.
* క్రోమ్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయండి.
* క్రోమ్ About ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
* ‘Update Google Chrome’ ఆప్షన్ గుర్తించి, దానిపై క్లిక్ చేయండి.

అప్‌డేట్ ఆప్షన్ కనిపించకపోతే, బ్రౌజర్ ఇప్పటికే లేటెస్ట్ వెర్షన్‌లో ఉందని అర్థం. ఈ పరిష్కారాన్ని రాబోయే రోజులు లేదా వారాల్లో క్రమంగా అమలు చేస్తామని గూగుల్ యూజర్లకు హామీ ఇచ్చింది. ఈ అప్‌డేట్ వినియోగదారులందరికీ తక్షణమే అందుబాటులో ఉండకపోవచ్చు. అయినప్పటికీ, సీవీఈ-2023-6345 ద్వారా ఎదురయ్యే రిస్క్ దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు తమ క్రోమ్ బ్రౌజర్లను అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి.

Read Also : Apple iPhone 16 Series : కొత్త యాక్షన్ బటన్‌తో ఐఫోన్ 16 సిరీస్ వస్తోంది.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు