New SIM Card Rules : సిమ్ కార్డులపై కొత్త రూల్స్.. ఈరోజు నుంచే అమల్లోకి.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా!

New SIM Card Rules : కొత్త సిమ్ కార్డ్ నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఇందులో బల్క్ సిమ్ కార్డ్‌ల అమ్మకాన్ని రద్దు చేసింది. పీఓఎస్ ఏజెంట్లు, పంపిణీదారుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.

New SIM Card Rules : సిమ్ కార్డులపై కొత్త రూల్స్.. ఈరోజు నుంచే అమల్లోకి.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా!

New SIM card rules to be applicable from Today

New SIM Card Rules : భారత టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) సిమ్ కార్డ్‌లపై కొత్త నిబంధనలు ఈరోజు నుంచి అంటే.. డిసెంబర్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి ప్రకటించినప్పటికీ, వాయిదా పడింది. సవరించిన నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం సిమ్ కార్డ్ విక్రేతల ధృవీకరణను తప్పనిసరి చేసింది.

బల్క్ కనెక్షన్ల నిబంధనను రద్దు చేసింది. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. నకిలీ సిమ్‌ల వల్ల జరిగే మోసాల తీవ్రతను బట్టి నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు, జైలు శిక్ష వంటివి పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కొత్త సిమ్ కార్డ్ నియమాల గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Top Mobile Plans : ఎయిర్‌టెల్, జియో ప్లాన్లతో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

రిజిస్ట్రేషన్ తప్పనిసరి :
టెలికాం ఆపరేటర్లు ఫ్రాంచైజీలు, పంపిణీదారులు, పాయింట్-ఆఫ్-సేల్ (PoS) ఏజెంట్లు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అలాంటి ఏజెంట్లు అవాంఛిత అంశాలకు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారికి సిమ్ కార్డ్‌లను జారీ చేయకుండా నిరోధించవచ్చు. ప్రతి పీఓఎస్ ఏజెంట్ లైసెన్సీలతో రాతపూర్వక ఒప్పందం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ, పీఓఎస్ ఏజెంట్ కొత్త నిబంధనలను పాటించడంలో విఫలమైతే.. వారి రిజిస్ట్రేషన్ రద్దు చేయబడవచ్చు లేదా మూడేళ్ల బ్లాక్‌లిస్ట్‌ను ఎదుర్కోవచ్చు. అయితే, కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం పీఓఎస్ ఏజెంట్లకు 12 నెలల సమయం ఉంటుంది.

ఈ-కేవైసీ విధానం :
ప్రతి సిమ్ వినియోగదారు తమ డిజిటల్ ధృవీకరణ కోసం డిసెంబర్ 1 నుంచి డిజిటల్ నో యువర్ కస్టమర్ లేదా (e-KYC) కూడా తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సిమ్ కార్డ్ డీల్ కూడా డిజిటల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏదైనా సిమ్ విక్రయించేటప్పుడు ముందుగా సిమ్ కార్డ్ రిజిస్టర్ చేసుకోవాలి. పోలీస్ వెరిఫికేషన్ అనేది టెలికాం ఆపరేటర్ల బాధ్యత వహించాలి. డిజిటల్ కేవైసీని పాటించడంలో విఫలమైతే.. ఆయా డీలర్‌‌పై రూ. 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. సిమ్ రీప్లేస్‌మెంట్ విషయంలో.. ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్ సౌకర్యాల నుంచి 24 గంటలలోపు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి.

New SIM card rules to be applicable from Today

New SIM card rules

ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించడం :
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ముద్రిత ఆధార్‌ను ఎక్కువగా దుర్వినియోగం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో ముద్రించిన ఆధార్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జనాభా వివరాలను క్యాప్చర్ చేయడం తప్పనిసరి. మొబైల్ నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేసే ముందు, 90 రోజుల కూల్-ఆఫ్ పీరియడ్ ఉంటుంది.

బల్క్ సిమ్ కార్డ్ కనెక్షన్‌ రద్దు :
మోసపూరిత కార్యకలాపాలను ఎదుర్కోవటానికి, ప్రభుత్వం బల్క్ కనెక్షన్ల నిబంధనలను నిలిపివేసింది. సిమ్ మోసాలను అరికట్టడానికి ధృవీకరణ తప్పనిసరి చేసినట్టు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే, ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే డీలర్లు రూ. 10 లక్షల జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలో ప్రకటించారు.

కొత్త సిమ్ కార్డ్ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఒక వినియోగదారు తమ ఐడీలో 9 సిమ్ కార్డ్‌లను పొందవచ్చు. దొంగిలించిన లేదా పోగొట్టుకున్న మొబైల్‌లను రిపోర్టు చేయడానికి లేదా వాటిని బ్లాక్ చేయడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో సంచార్ సాథీ (Sanchar Saathi) పోర్టల్‌ను ప్రారంభించింది. అక్రమ మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఏఐ సాఫ్ట్‌వేర్ ఏఎస్‌టీఆర్‌ను ప్రవేశపెట్టింది.

Read Also : Indian Mobile Users : 70 లక్షల భారతీయ యూజర్ల మొబైల్ నెంబర్లు బ్లాక్.. మీ నెంబర్ సేఫ్‌గా ఉండాలంటే ఈ తప్పు అసలు చేయొద్దు!