Gmail Accounts Delete : వచ్చే వారం నుంచి ఈ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ డిలీట్ చేయనుంది.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి!

Gmail Accounts Delete : మీ జీమెయిల్ అకౌంట్ చెక్ చేసుకున్నారా? వచ్చేవారం నుంచి జీమెయిల్ అకౌంట్లను గూగుల్ పర్మినెంట్‌గా డిలీట్ చేయనుంది. ఇప్పటికే గూగుల్ కొత్త పాలసీపై అనేకసార్లు యూజర్లను హెచ్చరించింది.

Google will start deleting these Gmail accounts from next week

Gmail Accounts Delete : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? సాధారణంగా చాలామంది జీమెయిల్ అకౌంట్లను క్రియేట్ చేస్తుంటారు. కానీ, అందులో ఒకటో రెండో మాత్రమే జీమెయిల్ అకౌంట్లను వాడుతుంటారు. కొన్ని జీమెయిల్ అకౌంట్లను క్రియేట్ చేసిన తర్వాత ఏళ్ల తరబడి అలానే వదిలేస్తుంటారు. ఇలాంటి జీమెయిల్ అకౌంట్లు వచ్చేవారం నుంచి పర్మినెంట్‌గా డిలీట్ కానున్నాయి. ఇప్పటికే, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ జీమెయిల్ అకౌంట్లకు సంబంధించి కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించింది.

Read Also : Gmail Bulk Messages : మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయిందా? సింగిల్ క్లిక్‌తో బల్క్ మెసేజ్‌లన్నీ డిలీట్ చేసుకోవచ్చు..!

ఇప్పటికే జీమెయిల్ యూజర్లను కూడా అలర్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్ల తొలగింపునకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త పాలసీ అమల్లోకి రానుంది. జీమెయిల్ అకౌంట్లలో ఫొటోలు, డ్రైవ్ డాక్యుమెంట్‌లు, కాంటాక్ట్‌లు వంటి మరిన్నింటి అనుబంధిత కంటెంట్‌ను శాశ్వతంగా టెక్ దిగ్గజం తొలగించనుంది. కనీసం 2 ఏళ్ల పాటు ఉపయోగించని లేదా యాక్సెస్ చేయని జీమెయిల్ అకౌంట్లను తొలగించాలని గూగుల్ నిర్ణయించింది.

ఆ జీమెయిల్ అకౌంట్లకు మినహాయింపు :

ముఖ్యంగా, కొత్త పాలసీ ప్రకారం.. స్కూల్స్ లేదా వ్యాపారాల వంటి సంస్థలకు లింక్ చేసిన జీమెయిల్ అకౌంట్లను మినహాయిస్తుంది. జీమెయిల్ అకౌంట్ తొలగింపు ప్రక్రియకు ముందు మల్టీ నోటిఫికేషన్‌లను పంపుతామని వెల్లడించింది. గూగుల్ అందించే సర్వీసుల్లో ప్రధానంగా జీమెయిల్, గూగుల్ డ్రైవ్, డాక్స్, మీట్, క్యాలెండర్, ఫొటోస్ వంటి వాటిపై ప్రభావం ఉండనుంది. అంతేకాదు.. యూట్యూబ్ లేదా బ్లాగర్ కంటెంట్‌ని కలిగిన జీమెయిల్ అకౌంట్లలో ప్రస్తుతం తొలగింపు ప్రోటోకాల్ నుంచి మినహాయింపు ఉంటుందని గూగుల్ స్పష్టంగా పేర్కొంది.

జీమెయిల్ తొలగింపు ప్రక్రియకు ముందుగానే వినియోగదారులను వరుస నోటిఫికేషన్లతో అప్రమత్తం చేస్తోంది. గూగుల్ నోటిఫికేషన్‌లు ఇన్‌యాక్టివ్ అకౌంట్, ఏదైనా లింక్ చేసిన రికవరీ ఇమెయిల్ అడ్రస్‌లకు పంపుతోంది. తద్వారా వినియోగదారులకు ముందుగానే అప్రమత్తం చేయడం ద్వారా వారి అకౌంట్లను కొనసాగించడానికి మరో అవకాశాన్ని కల్పిస్తోంది.

Google deleting Gmail accounts 

జీమెయిల్ అకౌంట్లను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే? :

జీమెయిల్ అకౌంట్ తొలగింపును నివారించడానికి వినియోగదారులు వెంటనే ఆయా అకౌంట్లను ఒకసారైన యాక్సస్ చేయాలని సూచిస్తోంది. ఈ యాక్టివిటీలో ఇమెయిల్‌లను చూడటం లేదా పంపడం, గూగుల్ డిస్క్ డిస్క్‌ని ఉపయోగించడం, యూట్యూబ్ వీడియోను చూడటం, గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, గూగుల్ సెర్చ్ కోసం ఉపయోగించడం, థర్డ్ పార్టీ యాప్‌లు లేదా సర్వీసుల కోసం గూగుల్‌తో సైన్ ఇన్ చేయడం వంటివి ఉంటాయి. అదనంగా, గూగుల్ ఫొటోల కోసం వినియోగదారులు నిరంతర యాక్టివిటీని నిర్ధారించడానికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి గూగుల్ ఫొటోల అకౌంట్లలో లాగిన్ చేయాల్సి ఉంటుంది.

అకౌంట్ యాక్టివిటీని కొనసాగించేందుకు గూగుల్ వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇన్‌యాక్టివ్ అకౌంట్లను గురించి యూజర్లకు రిమైండర్‌లను పంపుతోంది. తద్వారా అకౌంట్లలో డేటా నష్టపోకుండా ఉండేలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 1 వరకు గడువు ఉన్నందున వినియోగదారులు తమ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవడానికి మరికొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. అప్పటిలోగా మీ ఇన్ యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గుర్తించి యాక్సస్ చేసుకోవాలని గూగుల్ సూచిస్తోంది.

Read Also : Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్.. కేవలం రూ.27,499కే సొంతం చేసుకోవచ్చు!