4G Smartphones : మొబైల్ కంపెనీలకు అలర్ట్.. రూ.10వేలకు పైగా ధర ఉన్న అన్ని 4G ఫోన్లను నిలిపివేయాల్సిందే.. ఎందుకో తెలుసా?

4G SmartPhones : మీరు 4G ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఉన్నతాధికారులు 4G ఫోన్లను నిలిపివేయాల్సిందిగా మొబైల్ కంపెనీ తయారీదారులను కోరుతున్నారు.

Govt asks mobile companies to discontinue all 4G phones priced above Rs 10,000

4G SmartPhones : మీరు 4G ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఉన్నతాధికారులు 4G ఫోన్లను నిలిపివేయాల్సిందిగా మొబైల్ కంపెనీ తయారీదారులను కోరుతున్నారు. ఇటీవలే ఫోన్ కంపెనీలతో సమావేశమై 4G డివైజ్‌ల నుంచి పూర్తిగా 5Gకి మారాలని కోరారు. 5G స్మార్ట్‌ఫోన్‌లతో 5G సర్వీసులను మారడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉందని మంత్రిత్వ శాఖ అధికారులు మొబైల్ తయారీదారులకు సూచించారు.

నివేదిక ప్రకారం.. భారత్‌లో దాదాపు 750 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. వీరిలో 350 మిలియన్లకు పైగా యూజర్లు 3G లేదా 4Gకి సపోర్టుతో వచ్చే ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. భారత్‌లో 100 మిలియన్ల మంది యూజర్లు 5G-రెడీ ఫోన్‌లను కలిగి ఉన్నారు. రూ. 10వేల కన్నా ఎక్కువ ఖరీదు చేసే 3G-4G కంప్యాటబుల్ ఫోన్‌ల ఉత్పత్తిని క్రమంగా నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు.. 5G టెక్నాలజీకి పూర్తిగా మారాలని మంత్రిత్వ శాఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సూచించినట్లు సమాచారం.

Govt asks mobile companies to discontinue all 4G phones priced above Rs 10,000

ప్రస్తుతం, Airtel, Reliance Jio రెండూ ఎంపిక చేసిన నగరాల్లో తమ 5G సర్వీసులను అందిస్తున్నాయి. Jio 5G 4 నగరాల్లో అందుబాటులో ఉండగా.. Airtel మొత్తం 8 నగరాల్లో 5G ప్లస్ సర్వీసులను అందిస్తోంది. ఇతర నగరాలకు అతి త్వరలో 5G యాక్సెస్ లభిస్తుందని రెండు టెలికాం ఆపరేటర్లు ధృవీకరించారు. జియో 5G సర్వీసుల పాన్ ఇండియా 2023 చివరి నాటికి పూర్తి అవుతుందని పేర్కొంది. Airtel 5G మార్చి 2024 నాటికి దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకుంటుందని తెలిపింది.

అర్హత కలిగిన నగరాల్లో నివసిస్తున్న కొంతమంది 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లు Jio లేదా Airtel 5G సర్వీసులను వినియోగిస్తున్నారు. కొంతమంది 5G ఫోన్ యూజర్లు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని ఉపయోగించలేరు. ఎందుకంటే Jio, Aitel 5G సర్వీసులకు కేవలం n28, n78, n258 అనే మూడు బ్యాండ్‌లు మాత్రమే సపోర్టు అందిస్తున్నాయి. ఈ ఫోన్‌లో జియో లేదా ఎయిర్‌టెల్ 5G సర్వీసులను సజావుగా అమలు చేసేందుకు మీ స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఈ బ్యాండ్‌లకు సపోర్టుతో రావాల్సి ఉంటుంది.

Govt asks mobile companies to discontinue all 4G phones priced above Rs 10,000

అన్ని 5G డివైజ్‌ల కోసం సాఫ్ట్‌వేర్ FOTA అప్‌డేట్‌ల విస్తరణలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, టెలికాం ఆపరేటర్ల ప్రమేయం ఉందని కూడా సమావేశంలో చర్చించారు. 5G కంప్యాటబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. కానీ, ఇప్పటికీ Jio లేదా Airtel 5G సర్వీసులను అమలు చేయలేకపోతున్నాయి. అలాంటప్పుడు, మీ ఫోన్ 5Gని అమలు చేయాలంటే OEM ఒక అప్‌డేట్ పొందాలి. అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు Apple, Samsungతో సహా రాబోయే వారాలు/నెలల్లో అవసరమైన OTA అప్‌డేట్‌ను అందిస్తాయని సూచిస్తున్నాయి. లేటెస్ట్ iPhone 14 సిరీస్‌తో సహా అర్హత ఉన్న iPhone మోడల్‌లు ప్రస్తుతం Jio లేదా Airtel 5Gని అమలు చేయలేవని గుర్తించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best 5G Smartphones 2022 : రూ. 15వేల లోపు మంచి 5G ఫోన్ కావాలా? ఈ 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి..!