Gujarat Students Design Motorbike That Runs On Both Petrol And Electricity
motorbike runs petrol and electricity : ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో.. ఇప్పుడు వాహనదారులంతా ఎలక్ట్రిక్ బైకుల వైపు చూస్తున్నారు.. ప్రస్తుత డిమాండ్ దృష్ట్యా రాజస్థాన్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఒక సరికొత్త మోటార్ బైక్ డిజైన్ చేశారు. ఈ మోటార్ బైక్.. రెండు విధాలుగా నడుస్తుంది. ఒకటి పెట్రోల్‌తో నడుస్తుంది.. రెండోది ఎలక్ట్రికల్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది. VVP ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ టూ ఇన్ వన్ బైక్ తయారుచేశారు. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 40కిలోమీటర్ల వరకు నడుస్తుంది.
ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఏడో సెమిస్టర్ ప్రాక్టికల్స్ లో భాగంగా ఒక పెట్రోల్ ఇంజిన్ తో నడిచే బైక్ ను మాఢిఫై చేశారు. దీనికి అసలు కారణం.. పెట్రోల్ ధరలు పెరిగిపోవడం.. అంతేకాదు.. ఎలక్ట్రిక్ బైకులు కూడా చాలా ఖరీదైనవి ఉన్నాయి. అలాగే ఛార్జింగ్ చాలా స్లోగా ఉంటుంది. ఇలా కారణాలతో ఈ కొత్త టూ ఇన్ వన్ బైక్ ను కనుగొన్నారు. పెట్రోల్ తో నడవాలంటే పెట్రోల్ పోసుకోవచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ మాదిరిగా నడవాలంటే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఏది కావాలంటే అలా వాడుకునేలా ఈ బైక్‌ను డిజైన్ చేశారు. ఇందుకోసం ఈ బైక్ లో రెండు వేర్వేరు స్విచ్ లు ఉన్నాయి.
మీకు ఏ మోడ్ ఇంజిన్ రన్ కావాలంటే అది స్విచ్ ఆన్ చేయొచ్చు. ఈ బైకుకు నాలుగు వేర్వేరు బ్యాటరీలు అమర్చారు. ఈ బ్యాటరీ ఛార్జ్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. గరిష్టంగా 40 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. గంటకు ఒక యూనిట్ కు పవర్ ఛార్జ్ 17 పైసలు నుంచి ఉంటుంది. ఈ సరికొత్త బైక్ ను ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడంతో 500 లైకులు, టన్నుల కొద్ది కామెంట్లు వచ్చాయి.