Hackers can now take control of your Google Account without needing a password
Google Accounts : మీ గూగుల్ అకౌంట్లు సురక్షితమేనా? తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే.. హ్యాకర్లు మీకు తెలియకుండానే మీ గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేయగలరు. మీ పాస్‌వర్డు అవసరం లేకుండానే సులభంగా మీ అకౌంట్లను తమ కంట్రోల్లోకి తీసుకోగలరు. ఇందుకోసం హ్యాకర్లు ఒక మార్గాన్ని కనుగొన్నారు.
మీరు ఒకవేళ మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ రీసెట్ చేసిన తర్వాత కూడా నిరంతర యాక్సెస్‌ను అనుమతిస్తుంది. మాల్వేర్, ఫిషింగ్ దాడుల నుంచి యూజర్లను రక్షించడానికి గూగుల్ ఇప్పుడు ఇన్‌స్టంట్ ప్రొటెక్షన్ అప్‌గ్రేడ్ చేస్తోంది. కొత్త దుర్బలత్వాన్ని భద్రతా సంస్థ (CloudSEK) విశ్లేషించింది.
Read Also : Moto G34 5G Launch : మోటో జీ34 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 9నే లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలివే..!
థర్డ్ పార్టీ కుక్కీలతో ముప్పు :
అక్టోబర్ 2023లో టెలిగ్రామ్ ఛానెల్‌లో హ్యాకర్ గురించి పోస్ట్ చేయడంతో ఈ సమస్య మొదట తెరపైకి వచ్చింది. యూజర్లను ట్రాక్ చేయడానికి వారి సామర్థ్యాన్ని పెంచడానికి వెబ్‌సైట్‌లు, బ్రౌజర్‌లు ఉపయోగించే థర్డ్-పార్టీ కుక్కీలలోని దుర్బలత్వం కారణంగా గూగుల్ అకౌంట్లు ఎలా హ్యాక్ అవుతాయి అనేదానిపై ఇండిపెండెంట్ రిపోర్టు పేర్కొంది. అదనంగా, గూగుల్ అథెంటికేషన్ కోసం కుక్కీ (cookies)లను వినియోగదారులు వారి లాగిన్ వివరాలను సేవ్ చేయడంలో వాటిని మళ్లీ ఎంటర్ చేయకుండా లాగిన్ చేయడంలో సాయపడతాయి.
పాస్‌వర్డ్ రీసెట్ చేసినా హ్యాకర్ల కంట్రోల్లోనే :
అయినప్పటికీ, హ్యాకర్లు ఇప్పుడు టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ కోసం ఈ కుక్కీలను తిరిగి పొందేందుకు ఒక మార్గాన్ని కనుగొన్నారు. యూజర్ల పాస్‌వర్డ్‌ని రీసెట్ చేసిన తర్వాత కూడా గూగుల్ సర్వీసులకు నిరంతర యాక్సస్ అనుమతిస్తుంది. సైబర్ థ్రెట్స్ కన్నా ముందు ఉండేందుకు సాంకేతిక దుర్బలత్వం వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుందని క్లౌడ్‌సేక్ ద్వారా బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.
Google Account password
అకౌంట్ల ప్రొటెక్షన్‌పై గూగుల్ ప్రకటన :
ది ఇండిపెండెంట్ రిపోర్టు ప్రకారం.. గూగుల్ క్రోమ్ ప్రస్తుతం బ్రౌజర్ అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియలో ఉందని, మాల్వేర్ బారిన పడకుండా యూజర్లను సురక్షితంగా ఉంచుతుందని పేర్కొంది. ఈ మేరకు గూగుల్ స్టేట్‌మెంట్ ఇలా పేర్కొంది.. ‘ఇలాంటి టెక్నిక్‌ల నుంచి గూగుల్ అకౌంట్ల రక్షణ కోసం బ్రౌజర్ అప్‌గ్రేడ్ చేస్తాం. మాల్వేర్ బారిన పడే వినియోగదారుల అకౌంట్లను సురక్షితంగా ఉంచుతాం.
ఈ సందర్భంలో, ఏదైనా హ్యాక్ అయిన అకౌంట్లను గుర్తించి వాటిని సురక్షితంగా ఉంచడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది’ అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తమ కంప్యూటర్ నుంచి ఏదైనా మాల్వేర్‌ను తొలగించడానికి నిరంతరం చర్యలు తీసుకోవాలి. ఫిషింగ్ మాల్వేర్ డౌన్‌లోడ్‌ల నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్‌లో మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను ఆన్ చేయాలని సిఫార్సు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.
Read Also : Poco M6 Pro India Launch : ఈ నెల 11న భారత్‌కు పోకో ఎం6 ప్రో వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవేనా?