Happy Ganesh Chaturthi 2025
Happy Ganesh Chaturthi 2025 : గణేష్ చతుర్థి పండగ వచ్చేస్తోంది. గణేశుడి 9 నవరాత్రులు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో (Happy Ganesh Chaturthi 2025) గణేశుడి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా గణేష్ చతుర్థి ఆగస్టు 26, 27 ఆగస్టు 2025 తేదీలలో వస్తుంది. కానీ, పండుగ కేవలం ఆచారాల కోసం మాత్రమే కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆన్‌లైన్‌లో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఈ పండుగ సందర్భంగా చాలా మంది ఇప్పుడు గణపతి బప్పా వాట్సాప్ స్టేటస్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పండుగ వాతావరణం మొదలైంది. మీరు కూడా గణేశుడి ఫొటోలు, వీడియోలతో పోస్టు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. గణేష్ చతుర్థి 2025 స్టేటస్ క్లిప్‌లను డౌన్‌లోడ్ చేసి షేర్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఇతర వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ ఎలా? :
యూట్యూబ్ మాత్రమే కాదు.. ఫెస్టివల్ క్లిప్‌లను ఫ్రీగా అందించే అనేక వెబ్‌సైట్‌లు ఉన్నాయి. గూగుల్‌లో ‘Happy Ganesh Chaturthi 2025 WhatsApp Status Video Download’ అని సెర్చ్ చేయండి.
Pexels, Pixabay, Pinterest, లేదా Unsplash వంటి వెబ్‌సైట్‌లలో అద్భుతమైన వీడియోలు, పండుగ డిజైన్‌లు ఉంటాయి. మీకు ఇష్టమైనదాన్ని MP4 వీడియో ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వాట్సాప్‌లో మాత్రమే కాకుండా, Instagram, Facebookలో కూడా షేర్ చేయవచ్చు. అలాగే, మీ ప్రియమైనవారికి నేరుగా పంపుకోవచ్చు.